పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ గుర్తున్నాడా..? ఆ మధ్య ఫిక్సింగ్ అరోపణలతో అంతర్జాతీయ క్రికెట్ సహా దేశీయ క్రికెట్ నుంచి వైదోలగి మళ్లీ పాక్ జాతీయ జట్టులోకి పునరాగమని చేసిన పాకిస్థాన్ పేస్ బౌలర్. గుర్తుకోచ్చాడా. అమిర్ తాజాగా మరో ఘనత సాధించాడు. అదేంటంటే లేటుగా అయినా లెటెస్టుగా అన్న తరహాలో లేటుగా అద్భుత క్యాచ్ పట్టుకున్నాడు. అదేంటి అంటరా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
అమీర్ ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడేళ్ల కెరీర్ కూడా ఉంది. అయితే టెస్టు ఫార్మాట్లో ఇంతకుముందు ఒక్క క్యాచ్ కూడా పట్టుకోలేకపోయాడు. షార్జాలో వెస్టిండీస్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆమిర్ తన కోరికను ఎట్టకేలకు తీర్చుకున్నాడు. ఆమిర్ అందుకున్నది తొలి క్యాచే అయినా అద్భుతం చేశాడు.పాక్ బౌలర్ జుల్ఫికర్ బాబర్ బౌలింగ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రావో షాట్ ఆడబోయాడు.
సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న ఆమిర్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆమిర్ బంతి పట్టుకున్న సమయంలో పూర్తిగా గాల్లో ఉన్నాడు. అతని శరీరం ఎక్కడా గ్రౌండ్‌కు టచ్ కాలేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. టెస్టు క్రికెట్లో ఇంత ఆలస్యంగా తొలి క్యాచ్ పట్టిన క్రికెటర్ ఆమిరే. షార్జా టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేయగా, వెస్టిండీస్ 337 పరుగులు చేసింది.ఈ ఏడాది జనవరిలో ఆమిర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more