టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు జపించకుండా ఏ దేశ క్రికెట్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది అయన కనబర్చిన అసాధారణ బ్యాటింగ్, కెప్టెన్ హోదాలో గెలిచిన విజయాలతో ఇప్పటికే క్రికెట్ చరిత్రలో పలు రికార్డులను సొంతం చేసుకున్న తరుణంలో.. తాజాగా అస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ జట్టుకు సారధ్యం వహించే అవకాశాన్ని కూడా అందుకున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వన్డే జట్టుకు కెప్టెన్ ఎంపికైన కోహ్లికి గ్రాత్ జట్టు నుంచి కూడా అదే స్థాయిలో పిలుపువచ్చింది.
అస్ట్రేలియా పేసర్ గ్రాత్ జట్టుకు కూడా సారధిగా విరాట్ ఎంపికయ్యాడు. ఈ ఏడాదికి గాను మెక్‌గ్రాత్ ఎంపిక చేసిన తన టెస్టు జట్టులో కోహ్లికి నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పాడు. దాంతోపాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న భారత్ ఆల్ రౌండర్ రవి చంద్రన్ అశ్విన్ కూడా మెక్ గ్రాత్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కాగా మరో భారత అటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా గ్రాత్ జట్టులో స్థానం సంపాదించాడు.
12 మందితో కూడిన మెక్ గ్రాత్ టెస్టు జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జానీ బెయిర్ స్టోలు ఉండగా, న్యూజిలాండ్ జట్టు నుంచి కేన్ విలియమ్సన్ చోటు దక్కించుకున్నాడు. ఇక పాకిస్తాన్ నుంచి స్పిన్నర్ యాసిర్ షా, దక్షిణాఫ్రికా నుంచి పేసర్ రబడాలకు చోటు దక్కించుకున్నారు. మరొకవైపు ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లను మాత్రమే తన జట్టులో మెక్ గ్రాత్ ఎంపిక చేశాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్‌లను ఆసీస్ జట్టు నుంచి మెక్ గ్రాత్ తీసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more