జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలుపర్చడంలో విఫలమైన బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వేటు వేయడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు ఎవరు..? ఈ పగ్గాలను అందుకోనున్న సమర్ధుడెవరన్న అంశంపై అప్పుడే క్రికెట్ అభిమానుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే బోర్డు తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థులైన వారి జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) బాస్ సౌరవ్ గంగూలీ పేరు వినిపిస్తోంది. క్రికెట్ వర్గాల్లో గంగూలీకి చాలామంది మద్దతు ఇస్తున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీయే సరైన వ్యక్తని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు.
టీమిండియా కెప్టెన్‌గా గంగూలీ జట్టును విజయవంతంగా నడిపించాడు. ప్రపంచ క్రికెట్లో టీమిండియా అత్యున్నత స్థాయికి చేరేలా కీలక పాత్ర పోషించాడు. మూడేళ్ల క్రితం క్రికెట్ రాజకీయాల్లోకి వచ్చిన దాదా క్యాబ్ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశాడు. దీంతో క్రికెటర్, పాలనాధ్యక్షుడిగా అనుభవం ఉన్న దాదాకు పగ్గాలు అప్పగిస్తే బీసీసీఐని గాడిలో పెడతాడని భావిస్తున్నారు. 1999-2000లో భారత క్రికెట్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాక గంగూలీని కెప్టెన్‌గా నియమించారని, అతను జట్టును గాడిలోపెట్టి విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడని గవాస్కర్ చెప్పాడు. కాగా కొన్ని టెలివిజన్ కాంట్రాక్టులు ఉన్న గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి పట్ల ఆసక్తి చూపకపోవచ్చని కొందరు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more