న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ట్వంటీ 20 లో కివీస్ ఆటగాడు కొలిన్ మున్రో(101) శతకం సాధించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ట్వంటీ 20 చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ తాజా సెంచరీతో న్యూజిలాండ్ ట్వంటీ 20ల్లో నాలుగు శతకాలను నమోదు చేసింది. అంతకుముందు మూడేసి సెంచరీలు మాత్రమే పలు జట్లు నమోదు చేశాయి.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ జట్లు మూడేసి సెంచరీలు చొప్పున సాధించగా, దాన్ని కివీస్ అధిగమించింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో మెకల్లమ్ రెండు ట్వంటీ 20 సెంచరీలు చేయగా, గప్టిల్, మున్రోలు తలో సెంచరీ చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 18.1 ఓవర్లలో148 పరుగులకే ఆలౌటై 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ సిరీస్‌ను కోల్పోయింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more