యువరాజ్ పునరాగమనంపై ఎమ్మెస్కే ఏమన్నాడంటే.. Yuvraj rewarded for strong domestic show: MSK Prasad

Yuvraj singh rewarded for strong domestic show msk prasad

team india, bcci, india vs england, Yuvraj Singh, domestic matches, Team india selection, Virat Kohli, MS dhoni, suresh raina, msk prasad, cricket

Yuvraj has made a comeback into the team due to his consistent performance in the domestic cricket which should be respected said msk prasad

యువరాజ్ పునరాగమనంపై ఎమ్మెస్కే ఏమన్నాడంటే..

Posted: 01/06/2017 06:42 PM IST
Yuvraj singh rewarded for strong domestic show msk prasad

సుదీర్ఘ కసరత్తు, మొక్కవోని అత్మవిశ్వాసంతో టీమిండియా జట్టులోకి ఎప్పటికైనా వస్తానన్న నమ్మకం అందుకు అంకుఠిత దీక్ష, దేశవాలీ ఆటలో సత్తాచాటం ఇలా అన్ని కలసోచ్చి తరుణంలో అతని పునారాగమనం సులువైపోయింది. అతనే వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్. సుమారుగా మూడేళ్ల విరామం తర్వాత.. వన్డే, టీ20 జట్లకు టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. జాతీయ జట్టులో స్థానం సంపాదించడానికి దేశవాలీ క్రికెట్ తో సత్తా చాటడంతో పాటు ఇంగ్లండ్‌పై మెరుగైన రికార్డు ఉండటం కూడా కలసి వచ్చింది.

బిసిసిఐ ప్రధాన సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఈ జట్లు సిద్ధమయ్యాయి. వన్డే, టి20 జట్ల సారథ్య బాధ్యతల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ధోనీ ప్రకటించిన తర్వాత ఎంపిక చేసిన తొలిజట్టు ఇదే కావడం విశేషం. దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత యువరాజ్‌ సింగ్ మళ్లీ వన్డే జట్టులోకి ఎంపిక కావడం ఈ జట్టులోని ముఖ్య విశేషం.
 
2013 డిసెంబర్‌లో చిట్టచివరి సారిగా భారత జట్టు తరఫున వన్డే మ్యాచ్‌లో ఆడిన యువరాజ్.. అప్పటినుంచి ఇప్పటివరకు జట్టుకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయితే, ఈమధ్య కాలంలో దేశవాళీ మ్యాచ్‌లలో యువరాజ్ బాగా ఆడుతున్నాడని, దాన్ని తప్పనిసరిగా అభినందించి, గుర్తించాల్సిందేనని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. తాము వీలైనంత బెస్ట్ టీంను ఎంపిక చేశామని, ఇది వీలైనంత బెస్ట్ రిజల్ట్ ఇస్తుందనే ఆశిస్తున్నామని ప్రసాద్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles