భారత క్రికెట్ పై జరుగుతున్న కుట్రలు ఫలించవని టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి హెచ్చరించాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ బోర్డు తెలుసుకోవడంలో జాప్యం చేస్తే.. బంగారు బాతు గుడ్లను పెట్టే బాతను చంపినల్లేనని అవుతుందని ఆయన ఉదహరించాడు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో చోటు చేసుకున్న సంక్షోభాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవద్దని వరల్డ్ క్రికెట్ బోర్డులకు సూచించాడు. బీసీసీఐలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనన్న విషయం గుర్తిస్తే మంచిదని హితవు పలికాడు. త్వరలోనే బిసిసిఐ పూర్వవైభవానికి చేరకుంటుందని అభిప్రాయపడ్డారు.
బీసీసీఐ నుంచి 80 శాతం ఆదాయం ఐసీసీకి సమకూరుతున్నప్పుడు అన్ని బోర్డులకు సమాన వాటా ఉండాలనే తాజా నిర్ణయంతో రవిశాస్త్రి విభేదించాడు. కేవలం బీసీసీఐ అడిగేది ఎక్ప్ట్రా షేరే కానీ, ఆ 80 శాతాన్ని ఇమ్మని అడగడం లేదు కదా అని నిలదీశాడు. భారత్ ను పక్కన పెడితే, ఎంత ఆదాయం వస్తుందో కూడా ఐసీసీ చూసుకోవాలని రవిశాస్త్రి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బీసీసీఐకు ఒక్క శ్రీలంక మాత్రమే అండగా నిలవగా, బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి చిన్న క్రికెట్ బోర్డులు కూడా మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.
ఇటివల ఐసీసీ తమ సభ్య దేశాలకు పంపిణీ చేసే ఆదాయ ఫార్ములాలో విప్లవాత్మకమైన మార్పులకు ఓటేసింది. ఈ ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకించింది. ఈ విషయంలో భారత్‌కు కేవలం శ్రీలంక నుంచి మాత్రమే మద్దతు లభించింది. జింబాబ్వే ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆదాయ పంపిణీలో మార్పులతో పాటు పరిపాలనా వ్యవస్థలో మార్పులకు మద్దతుగా ఓటింగ్‌లో పాల్గొన్నాయి.ఏప్రిల్‌లో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more