భారత క్రికెట్ జట్టు కెప్టెన్, మాజీ కెప్టెన్లపై ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ కు అచ్చమైన బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ దోని అయితే.. ఒక్క మాటలో చెప్పలేని బ్రిలియనట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అన్నాడు. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి టీమిండియాలో స్థానం సంపాదించడమే కాకుండా ఏకంగా దశాబ్ధకాలం పాటు జట్టుకు సారధిగా కొనసాగడం సాధారణ విషయం కాదని ధోనిని ఉద్దేశించి అన్నాడు. క్రికెట్ కు అచ్చమైన అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినేనని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఇక జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. అతనిలో కష్టపడేతత్వాన్ని తాను ఏనాడో చూశానని, అదే ఈ రోజు అతన్ని సారథిగా నిలబెట్టిందని కొనియాడాడు. విరాట్ కోహ్లి యువకుడిగా ఉన్న సమయంలోని అతనిలో పట్టుదల చూసినట్లు కుంబ్లే పేర్కొన్నాడు.
'కోహ్లికి 19 ఏళ్ల వయసులో అతనిలో కొన్ని లక్షణాలు నన్ను ఆకర్షించాయి. అతని నేతృత్వంలోని భారత్ అండర్-19 జట్టు వరల్డ్ కప్ గెలిచిన తరువాత కోహ్లిని తొలిసారి చూశా. రాయల్ చాలెంజర్స్ కు ఆడుతున్న సమయంలో కోహ్లి నడుచుకుంటూ వెళుతున్నాడు.అది అతన్ని మొదటిసారి చూడటం. ఆ సయమంలో అతను గేమ్ ను అభివృద్ధి చేసుకోవడం కోసం పడే తాపత్రాయం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. విరాట్ కోహ్లి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం. అతనొక బ్రిలియంట్ క్రికెటర్'అని కుంబ్లే పేర్కొన్నాడు.
ఇదిలా ఉంచితే, కోచ్ గా తాను కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లు కుంబ్లే తెలిపాడు. ఒక ఆటగాడ్ని ఫలానా మ్యాచ్ లో వేసుకోవడం లేదనే విషయాన్ని అతనికి చెప్పడం చాలా కష్టంగా ఉందన్నాడు. 'నువ్వు ఆడటం లేదని కానీ, నువ్వు స్క్వాడ్ లో లేవని కానీ ఆటగాళ్లకు చెప్పడం 'కోచ్ గా విపరీతమైన కష్టంగా ఉందన్నాడు. అయితే నాణ్యమైన జట్టు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more