వార్మప్ మ్యాచ్ లో అసీస్ విజృంభన India A vs Australia, practice match: Visitors 327/3 at stumps

India a vs australia 2017 three day practice match visitors 327 3 at stumps

india a vs australia, india a vs australia warm-up game, india a vs australia warm up, ind a vs aus 2017 warm up, australia, india vs australia test 2017, hardik pandya, steve smith, cricket news, cricket

The visitors would take heart from centuries from Steve Smith and Shaun Marsh as it bodes well for them in the upcoming series.

వార్మప్ మ్యాచ్ లో అసీస్ విజృంభన

Posted: 02/17/2017 08:59 PM IST
India a vs australia 2017 three day practice match visitors 327 3 at stumps

భారత 'ఎ' జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా వీరవిహారం చేసింది. అసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్ లు శతకాలతో రాణించడంతో.. అసీస్ తొలిరోజు అటముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు నమోదు చేశాడు. టాస్ గెలిచిన టీమిండియా ఏ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఫీల్డింగ్ కు మొగ్గుచూపాడు. దాంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 55 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(25), రెన్ షా(11)లు ఆదిలోనే పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా తడబడినట్లు కనిపించింది.

ఆ తరుణంలో స్మిత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. షాన్ మార్ష్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే స్మిత్ శతకాన్ని నమోదు చేసి రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత షాన్ మార్ష్ కూడా సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్, మార్ష్ కలసి సుమారుగా రెండు వందల పరుగుల బాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పీటర్ హాండ్స్ కోంబ్ వికెట్ ను తీసిని పాండ్యా.. అదే జోరును కొనసాగించాడు. కాగా, తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి మాథ్యూ వేడ్, మిచ్చెల్ మార్ష్ లు క్రీజ్ లో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : india vs australia  team india  Australia  Hardik Pandya  Steven Smith  Mumbai  cricket  sports news  cricket  

Other Articles