ఆస్ట్రేలియాతో తుది సమరంలో భారత జట్టులోకి ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రావడం ఇంచుమించు ఖరారైంది. బోర్డర్ - గవాస్కర్ సిరీస్ వశం కావాలంటే చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలిచి తీరాలి. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న క్యూరేటర్ సునీల్ చౌహాన్ అంచనాతో షమీని సిద్ధం చేశారు. గత ఏడాది ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ సందర్భంగా మోకాలి గాయంతో వైదొలగిన షమీ మొన్న విజయ్ హరారే ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడాడు. 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇప్పటికే భారత్ జట్టుతో పాటు షమీ కూడా ధర్మశాల చేరుకున్నాడు.
ప్రస్తుతం ఇద్దరు పేసర్లు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ చెమటోడుస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ ఉన్నా తుది జట్టులో స్థానం దక్కలేదు. పేసర్ల దాడిని ముమ్మరం చేయాలన్న యోచనతో షమీని తీసుకోవాలని నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. వన్డే మ్యాచ్. మోకాలి గాయం నుంచి కొద్ది రోజుల కిందటే కోలుకున్న షమీ టెస్ట్‌లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయగలడా అనే సందేహం ఉన్నా ఆడగలడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి బిసిసిఐ వర్గాలు.. ‘ధర్మశాలలో అందమైన ఉదయం’ అంటూ షమీ ట్వీట్ చేయడంతో ఆయన అక్కడికి చేరుకున్నాడన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే ఇటీవల రోహిత్ శర్మ కూడా బెంగళూరు టెస్టెకు ముందు అక్కడకు వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more