రెండేళ్ల క్రితం అస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ ను కోల్పోవడంతో టెస్టు క్రికెట్ పగ్గాలను వదిలేస్తున్నట్లు ప్రకటించి అందరినీ అశ్చర్యపర్చి, అభిమానులకు షాకిచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా స్వప్తి పలికిని విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆయన ఛాంఫియన్స్ ట్రాఫీ తరువాత వైదొలుగుతాడని పలు వాదనలు వినిపిస్తుండగా, ఫిట్‌నెస్ తో ఉన్న ధోని 2019 ప్రపంచ కప్ కూడా అడతాడని మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో క్రికెట్ నుంచి ఇప్పుడప్పుడే రిటైరయ్యే ఆలోచన తనకు లేదని లేదని ధోనీ సంకేతాలిచ్చాడు. నేరుగా కాకాపోయినా ఆయనిచ్చిన సంకేతాలలో క్రీడా విశ్లేషకులకే అధికంగా పని కల్పించాడు. తాను అడవచ్చు లేదా అడకపోవచ్చు అంటూ వేదాంత ధోరణిని ప్రదర్శిస్తూనే చిట్టచివరన క్లారిటీ మాత్రం ఇచ్చాడు., ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహీని మీడియా ఇదే రకమైన ప్రశ్నలను గుప్పించింది. దీంతో ఆయన తన మనస్సులోని మాటలను చూచాయగా చెప్పాడు.
2019 వరల్డ్‌కప్ ఖచ్చితంగా అడతారా..? అన్న ప్రశ్నపై స్పందించిన ఆయన ఈ ప్రశ్నల విశ్వకప్ ముందు అడిగితే తాను చెప్పగలనని, రెండేళ్లు ముందుగానే తనను ఈ ప్రశ్న అడుగుతారని ఊహించ లేదన్నారు. ప్రపంచ కప్ సమాయం లోగా ఏమైనా జరగవచ్చునని, తాను గాయాలపాలు కావచ్చునన్నారు. లేక మరే ఇతర పరిణామాలైన చోటుచేసుకోవచ్చున్నాడు. అయితే చివరగా మాత్రం తను ప్రస్తుతం వున్న పిట్ నెస్ ఆధారంగా విశ్వకప్ తరువాత కూడా తాను క్రికెట్ లో కొనసాగగలనని ధీవమా వ్యక్తం చేశాడు. ఇదే జరిగితే ధోని నాలుగు వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా రికార్డులకెక్కే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more