Kumble 'leaked' Team India information to media? ఔనా..! నిజంగా కుంబ్లే ‘లీక్’ చేశాడా..?

Kumble leaked team india information to media

Champions Trophy, ICC, anil kumble, virat kohli, Team india, head coach, icc champions trophy 2017, cricket, England, cricket news, sports news, spots, cricket

India will be looking to retain the ICC Champions Trophy without losing any matches and the only thing that matters to skipper Virat Kohli is to win matches for India.

ఔనా..! నిజంగా కుంబ్లే ‘లీక్’ చేశాడా..?

Posted: 06/01/2017 07:12 PM IST
Kumble leaked team india information to media

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీల రానురాను అంతరం పెరుగుతుందన్న కథనాలకు కొదవేమీ లేదు, అసలు వీరిద్దరికీ పొసగడం లేదని, కుంబ్లే రావడంతోనే నెట్స్ లో ప్రాక్టీసు చేస్తున్న కోహ్లీ దూరంగా ఆట ముగించుకుని వెళ్లిపోతున్నాడని కూడా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగడానికి కారణం ఏంటన్న కోణంలో అనేక కథలు, కథనాలు వినబడుతున్నాయి. వీరిద్దరిని టార్గెట్ చేసుకుని రోజుకొక కొత్త వివాదం తెర మీదకు వస్తోంది.

తాజాగా జట్టుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాలో ఉన్న తన మిత్రులకు కుంబ్లే లీక్ చేస్తున్నాడంటూ కొత్త రూమర్ ప్రస్తుతం మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించి డీఎన్ఏ వార్తాపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. మీడియాలో తనకు నమ్మకమైన స్నేహితులతో ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన అనీల్ కుంబ్లే.. జట్టుతో పాటు రహస్యంగా వుంచాల్సిన పలు విషయాలను మీడియా మిత్రులకు లీక్ చేస్తున్నాడన్న కథనం తీవ్ర కలకలం రేపుతుంది.  వాట్సాప్ గ్రూపు ద్వారా జట్టుకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నాడని సదరు పత్రిక కథనంలో పేర్కోంది.

అంతేకాదు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పటి సమాచారాన్ని కూడా వాట్సాప్ లో పంపుతున్నాడని పేర్కొంది. ఈ మేరకు బీసిసిఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారని కూడా పేర్కోంది. ఈ నేపథ్యంలో కుంబ్లే, కోహ్లీల మధ్య అగాధం మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కోచ్ గా కుంబ్లే పదవీకాలం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో, కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ కొత్త కోచ్ ను ఎంపిక చేయనుంది. ఈ పదవికి ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ దాఖలు చేసుకోగా టామ్ మూడీ కూడా బరిలో నిలిచేందుకు అసక్తి చూపుతున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  anil kumble  virat kohli  Team india  head coach  cricket  

Other Articles