Injury may keep Mathews out of CT opener ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే శ్రీలంకకు ఎదురుదెబ్బ

Sri lanka skipper to miss tournament opener against south africa

angelo mathews, angelo mathews sri lanka, sri lanka, sri lanka angelo mathews, icc champions trophy 2017, cricket, sports news, cricket news, latest news

Sri Lanka skipper Angelo Mathews is likely to miss the ICC Champions Trophy's opening match against South Africa which is scheduled to take place on Saturday.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే శ్రీలంకకు ఎదురుదెబ్బ

Posted: 06/01/2017 07:59 PM IST
Sri lanka skipper to miss tournament opener against south africa

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ టోర్నీకి దూరం కానున్నాడని సమాచారం. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో శనివారం జరగనున్న మ్యాచ్ కు మాత్రం ఆయన దూరమవుతున్నారన్న వార్తను శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. సరిగ్గా ఛాంఫియన్స్ ట్రోఫీ ముందే అయన గాయం కారణంగా ఆడలేడని బోర్డు ప్రకటించడం జట్టుకు ఎదురుదెబ్జే. దీంతో వైస్‌ కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
 
గతంలో తొడ కండరాలు పట్టేయడంతో జింబాంబ్వే సిరీస్‌కు దూరమైన మాథ్యూస్‌ మళ్లీ అదే గాయం తిరగబెట్టడంతో ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫిలో అడుతాడా... లేక అడలేదా అన్న విషయం ఇంకా సందిగ్ధంలోనే వుంది. అయితే చాంఫియన్స్ ట్రోఫీలోని తొలి మ్యాచ్ కు మాత్రమే అయన దూరం అవుతాడని, మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో వుంటాడని బోర్డు చెబుతున్నా.. వేచి చూడక తప్పని పరిస్థితి ఎదురవుతుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. కాగా, మాథ్యూస్‌ చివరి వన్డే మ్యాచ్‌ శ్రీలంకలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌ లో ఆడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc champions trophy  srilanka  angelo mathews  south africa  zimbambwe series  injury  cricket  

Other Articles