ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి రషీద్ లతీఫ్ తెలిపాడు. గతంలో సెహ్వాగ్‌పై చేసిన వ్యాఖ్యలను లతీఫ్ వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు సెహ్వాగ్, కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. సెహ్వాగ్ గ్రేట్ ప్లేయర్ అని, కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సెహ్వాగ్ రెండు త్రిశతకాలు సాధించాడు అతనెంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసని అన్నాడు.
ఐసీసీ వన్డే ఈవెంట్లో ఉప ఖండానికి చెందిన మూడు దేశాలు సెమీఫైనల్ చేరడం చాలా అరుదుగా జరుగుతోందని తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా మరో వీడియోలో పేర్కోన్నాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కే ఎక్కువ మంది అభిమానులు ఉంటారని అందుకనే ఈ రెండు జట్టు ఫైనల్ లో తలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్. కుంబ్లే నిజాయతీ గల వ్యక్తని తన కెరీర్లో కుంబ్లేని ఎదుర్కొన్నానని చెప్పాడు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. టోర్నీలో భాగంగా లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ అనంతరం సెహ్వాగ్ చేసిన ఓ సరదా ట్వీట్‌పై లతీఫ్ స్పందిస్తూ.. 15నిమిషాల నిడివి ఉన్న వీడియో పెట్టాడు. అందులో భారత్‌ను తీవ్రంగా దూషించాడు. దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ.. ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యల కంటే అర్థవంతమైన మౌనమే మంచిదంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more