ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెమీస్ లో భారత్-బంగ్లాదేశ్ పోరుకు ఇంకా కాస్త సమయం ఉన్నా బంగ్లా క్రికెట్ అభిమానులు మాత్రం అప్పుడే వేడిని రగుల్చుతూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇరు దేశాల మధ్య సాగుతున్న ఈ యుద్దంలో బంగ్లాదేశ్ అభిమానులు గతంలో మాదిరిగానే ఈ సారి కూడా విమర్శల పాలవుతున్నారు. ఇరు దేశాల అభిమానుల మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైంది. లీగ్ లో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవ్వడం కలిసొచ్చిన బంగ్లా... ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా విజయం సాధించి సెమీఫైనల్‌కి అర్హత సాధించింది. టోర్నీలో రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్... భారత్‌తో తలపడనుంది.
ఈ నేపథ్యంలో భారత్-బంగ్లా పోరుపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వార్ మొదలైంది. తమ అభిమాన జట్టుకు మద్దతిస్తూ పలువురు పోస్టులు, ఫొటోలు పంచుకుంటున్నారు. బంగ్లా అభిమానులు మాత్రం భారత్‌ను అవమానిస్తూ అభ్యంతకర ట్వీట్లు చేస్తున్నారు. గతంలోనూ ఓసారి భారత్-బంగ్లా పోరు సమయంలో ఇలాంటిదే చోటు చేసుకుంది. భారత్ నుంచే కాక ప్రపంచ నలుదిశల నుంచి బంగ్లా అభిమానులు తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయినా తన ధోరణి మార్చుకోని బంగ్లాదేశ్ అభిమానులు మరోమారు అలాంటి చౌకబారు ప్రచారానికే తెరతీశారు. తాజాగా బంగ్లాదేశ్ కి చెందిన ఓ అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. శునకాన్ని వేటాడుతున్న పులి చిత్రాన్ని తీసుకుని... బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని పులిపై, భారత పతాకాన్ని శునకంపై ఉంచాడు. ‘సోదురుడా, ఇదో మంచి పోరు కానుంది’ అని క్యాప్షన్ కూడా తగిలించాడు. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more