ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం మొదలైంది. టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడిందంటూ ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ సారథి అమిర్ సోహైల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపాయి. దీంతో ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు షాక్ కి గురయ్యారు. టోర్నీలో భాగంగా పాక్-ఇంగ్లాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ కు చెందిన ఓ వార్తా సంస్థ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న అమిర్ సొహైల్ ఫైనల్ చేరిన పాక్ జట్టుపై ఆరోపణలు చేశాడు. ఇతరుల కారణంగా పాక్ టోర్నీలో మ్యాచ్ లు గెలిచిందని ఆరోపించాడు.
ప్రస్తుత జట్టు సారథి సర్ఫరాజ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని అన్నాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం సర్ఫరాజ్ మాట్లాడుతూ జట్టులోని ఆటగాళ్ల కృషి వల్లే విజయం సాధించామని ఎక్కడా చెప్పలేదు.. గమనించండి అని సోహైల్ పేర్కొన్నాడు. తమ విజయానికి ఎవరో సాయం చేశారన్న రీతిలోనే సర్ఫరాజ్ ఎప్పుడూ మాట్లాడేవాడు. దీంతో ఆట వెనుక ఏమి జరిగిందో మేమంతా వూహించగలం. జట్టు విజయానికి కారణమేమిటి అని అడిగినప్పుడల్లా... తాము చేసిన ప్రార్థనలు, అభిమానుల మద్దతు, దేవుడి దయ వల్లే అని చెబుతూ వచ్చాడు. బయటి శక్తుల కారణంగానే పాక్ ఫైనల్ చేరుకుంది.
ఇప్పటికైనా మించి పోయింది లేదు... ఇక నుంచి క్రికెట్ ఆడండి అని సోహైల్ ఈ సందర్భంగా జట్టును కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారడటంతో పాక్ -ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో జరిగిన లీగ్ మ్యాచుల్లో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ చేరిన ఇంగ్లాండ్ ను పాక్ మట్టికరిపించడం కూడా ఇందులో భాగమేనన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more