టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారధ్య పగ్గాలు చేపట్టిన నాటి నుంచి.. మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసిస్తూనే వున్నాడు. అయితే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ లో మాత్రం అందుకు కొంత బిన్నంగా వ్యవహరించాడు. వీరిద్దరి మధ్య చక్కగా వున్న అనుబంధానికి ఇక బ్రేకులు పడినట్లేనా అన్న అనుమానాలు కలిగే విధంగా మారాయి పరిణమాలు. కోహ్లీ ఏకంగా ధోనిపై అరిచేశాడు. అనవసరంగా ఐదు పరుగులు ఇచ్చిన కారణంగా సహనం కోల్పోయిన కోహ్లీ... ధోనీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే... టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టింది. మధ్యమధ్యలో ఫీల్డింగ్ తప్పిదాల వల్ల టీమిండియా ఫీల్డర్లు కొన్ని పరుగులు అప్పగించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ఆటగాడు మొసాదిక్ ను రన్ ఔట్ చేసేందుకు యత్నించే క్రమంలో జరిగిన అనవసర తప్పిదం వల్ల భారత్ ఐదు పరుగుల్ని అప్పగించుకుంది. సహచర ఆటగాడి నుంచి బాంతిని అందుకున్న ధోనీ వికెట్లకు విసిరే క్రమంలో పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన చేశాడు.
ఈ దశలో భారత్... బంగ్లాకు అనవసరంగా ఐదు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో కొంత అసహనానికి గురైన కోహ్లీకి ధోనీపై అరిచేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఎక్స్‌ట్రాల రూపంలో 23 పరుగులు ఇవ్వడం గమనార్హం. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 9వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ శతకంతో రాణించగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీని నమోదు చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్.. పాకిస్థాన్‌తో తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more