టీమిండియ క్రికెట్ అంటే మన దిగ్గజ క్రికెటర్లను ప్రపంచమంతా ఎటా గుర్తిస్తుందో.. అచ్చంగా అలానే.. ఇప్పుడు టీమిండియా మహిళా క్రికెట్ అనగానే కెప్టెన్ మిథాలీ రాజ్, గోస్వామి, హర్మన్ ప్రీత్ సింగ్, ఇలా మహిళా క్రికెటర్లు కూడా ఇప్పడు ప్రపంచ అభిమానులకు గుర్తుకువస్తారు. ఎందుకంటే ఇటీవల జరిగిన మహిళా ప్రపంచకప్ క్రికెట్ లో భారత మహిళా జట్టు ప్రదర్శించిన అద్భుత ప్రతిభ క్రికెట్ అభిమానులను అంతగా అకర్షించింది. వారి ప్రతిభ కారణంగానే అస్ట్రేలియా జట్టను ఓడించి ఫైనల్స్ వరకు చేరిన జట్టు.. తుదిపోరులో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైనా యావత్ ప్రపంచ అభిమానుల హృదయాలను మాత్రం గోలుచుకుంది.
రన్నర్ అప్ గా నిలిచిన టీమిండియా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. ప్రముఖ ఫ్యాషన్ మేగజైన్ 'వోగ్' తమ భారత సంచికపై పదేళ్ల వార్షికోత్సవ వేడుకల సందర్బంగా ఇచ్చిన అవార్డులలో మిథాలీ రాజ్ కు అవార్డు లభించింది, ఈమెతో పాటు అర్చర్ దీపాకా కుమారీకి కూడా అవార్డు లభించింది. దీంతో అమె ఫోటోను కూడా వోగ్ మ్యాగజీన్ తన కవర్ పేజీపై ప్రచురించింది. అక్టోబర్ నెల సంచిక కోసం మూడు రకాల కవర్ పేజీలను వోగ్ ఇండియా విడుదల చేసింది. వీటిలో ఒక కవర్ పేజీ మీద మిథాలీ రాజ్, షారుక్ ఖాన్, నీతా అంబానీల ఫొటోలను ప్రచురించింది.
మిగతా రెండు కవర్ పేజీల మీద ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, ట్వింకిల్ ఖన్నా, కరణ్ జొహార్, పద్మాలక్ష్మి, రష్యన్ మోడల్ నటాలియా వొడియానోవా చిత్రాలను ప్రచురించింది. `విమెన్ ఆఫ్ ద ఇయర్ అండ్ ద మెన్ వియ్ లవ్` పేరుతో వీరి చిత్రాలను వోగ్ ఇండియా ప్రచురించింది. బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల సరసన మిథాలీ స్టార్ గా ఎదగడానికి అమె ఎంచుకున్న రంగంలో కనబర్చిన ప్రతిభ దోహదపడిందనే చెప్పాలి. అయితే అంతకుముందు జరిగిన వేడుకల్లో మిథాలీతో పాటు అర్చర్ దీపికా కుమారీ అవార్డులను గెలుచుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more