టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచ వికెట్ కీపర్లలలో అగ్రగామి అనడంలో అతిశయోక్తి లేదు. స్పిన్నర్లతో వూరించే బంతులు వేయించి మెరుపు వేగంతో బ్యాట్స్ మన్లను స్టంపౌట్ చేయడంలో దిట్ట. అలాంటి ధోనీ అసీస్ తో గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20ల్లో స్టంపౌట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధోని అభిమానులు ఈ విషయాన్ని నిజమని భావించడం లేదంటే నమ్మండి. కానీ అలాంటిదే జరిగిపోయింది.
ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన బంతిని అడబోయిన మహేంద్రుడు స్టంపౌట్ కావడం దోని నేర్పిన విద్యేనని తెలిసి అబిమానులు షాక్ అవుతున్నారు. ఐపీఎల్ లో పుణె తరపున ఆడిన జంపాకు అప్పుడు మ్యాచ్ గెలిచేందుకు ఈ టెక్నిక్స్ చెప్పడంతో దానినే.. కీలక సమయంలో వినియోగించి దెబ్బకొట్టాడు జంపా. బంతిని షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చిన ధోనీ.. క్రీజులోంచి ముందుకురావడం.. బంతి బ్యాట్ కు తగిలేలోపే పిచ్ అయి కీపర్ చేతికి వెళ్లడం.. మెరుపువేగంతో అతడు వికెట్లను గిరాటేయడంతో ధోని పెవిలీయన్ కు చేరడం చకచకా జరిగిపోయాయి.
కెరీర్‌లో 80 టీ20లు ఆడిన ధోనీ స్టంపౌట్ కావడం ఇదే తొలిసారి. కాగా ధోనీ స్టంపౌట్ కావడంపై ట్విటర్ లో రకరకాల వ్యాఖ్యలు పెడుతున్నారు నెటిజన్లు. జంపా బౌలింగ్ లో పాండ్య సిక్సర్లు కొట్టగలడు కాబట్టే ధోనీ అలా ఔటయ్యాడని వ్యంగ్య బాణాలు విసిరారు. మరొకరు ధోనీ స్టంపౌట్ అయ్యాడంటే నమ్మలేం అంటున్నారు. మరికొందరేమో మహీ స్టంపౌట్ గుర్తు పెట్టుకో జంపా అంటున్నారు. వైద్యం చేసే రోగికే వ్యాధి సోకినట్లుందని కామెంట్లు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more