బీసీసీఐ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. ఐపీఎల్ లో అడిన జట్టును అర్థాంతరంగా తొలగించినందుకు ఇప్పడు అక్షరాలు రూ.850 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో బిసిసిఐ ఖజానాపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుకు తల్గొగి వుండి వుంటే.. సమస్య తక్కువ మొత్తంలోనే ఎప్పుడో సద్దుమణిగేది. అలాకాకుండా నాన్చివేత ధోరణి అవలంభించడంతో పాటు భారత క్రికెట్ నియంత్ర మండలి అధికారులు నిర్లక్ష్యం.. నిర్లిర్తత స్వభావం కూడా కలసి ఇప్పుడు పెద్దమొత్తంలో డబ్బును విధిలించాల్సిన అవసరం ఏర్పడింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి 2011లో రద్దు చేసిన కోచి టస్కర్ కేరళ ఫ్రాంచైజీకి రూ.800 కోట్ల కన్నా ఎక్కువ పరిహారం చెల్లించాల్సిన పరిస్థితిలోకి చేరకుంది బీసీసీఐ. ‘కోచి టస్కర్స్ రూ.850 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీన్ని మేం ఐపీఎల్ జీసీ సమావేశంలో చర్చించాం. ఇప్పుడు సర్వసభ్య సమావేశం ముందు సమస్యను ఉంచాలపి నిర్ణయించాం. ఇక తుది నిర్ణయం వారు తీసుకోవాల్సిందే. ఐతే బేరసారాల తప్పక ఉంటాయని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు.
2011లో కోచి టస్కర్ ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేయడంతో బ్యాంకు గ్యారెంటీ సొమ్ము తీసుకుంటామని ఆ జట్టు యాజమాన్యం కోరింది. అందుకు బీసీసీఐ ఒప్పుకోకుండా మొండితనంతో వ్యవహరించిన బీసీసీఐ. దీంతో ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లింది కోచి అక్కడ న్యాయం జరిగింది. అయినా బిసిసిఐ దిగిరాకపోవడతో.. కోచి ఆర్సీ లహోఠి నేతృత్వంలోని ఆర్బిట్రేషన్ కమిటీని అశ్రయించింది. అక్కడా కోచికి అనుకూలంగానే తీర్పువచ్చినా.. రెండేళ్ల నుంచి నాన్చుతూరావడంతో ఇప్పుడు తప్పక రూ.850 కోట్లు పరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more