భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని టీ ట్వంటీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని పలువురు మాజీ క్రికెటర్లు కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ధోనీకే మద్దతుగా నిలిచారు. టీ20ల నుంచి తప్పుకోవడం ధోనీకి మేలు చేయదని సన్నీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
తాజాగా కెప్టెన్ కోహ్లీ.. ధోనీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్న వారికి దీటుగా సమాధానం ఇచ్చాడు. తిరువనంతపురంలో పర్యాటక జట్టు కివీస్ తో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20లో భారత్ విజయం సాధించి 2-1తో సిరీస్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘ధోనీని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో నాకు అర్థం కావడంలేదు. ఒక బ్యాట్స్ మెన్ గా నేను వరుసగా మూడు సార్లు విఫలమైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే నా వయసు ఇంకా 35 సంవత్సరాలు కాదు కాబట్టి. ధోనీ ఇప్పుడు చాలా ఫిట్ గా ఉన్నాడు. ఫిట్నెస్ పై నిర్వహించిన అన్ని టెస్టుల్లో పాసవుతున్నాడు.
మైదానంలో జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ లో ధోనీ బ్యాట్ తో బాగానే రాణించాడు. ఈ సిరీస్ లో అతనికి ఎక్కువ సమయం మైదానంలో ఉండి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ధోనీ మాత్రమే కాదు ఈ సిరీస్ లో హార్దిక్ పాండ్య కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి అతన్ని ఎందుకు టార్గెట్ చేయరు. ఒక్క ధోనీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు. అలా చేయడం సరికాదు’ అని కోహ్లీ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more