Chopra Urges Selectors to Look Beyond Dhoni శ్రీలంకతో సిరీస్ కు ధోనిని ఎంపిక చేయకండీ..

Time is ripe to try somebody else instead of ms dhoni

Cricket, MS Dhoni, Dhoni exit, MS DHoni T20 cricket, T20 Dhoni, Dhoni, India cricket, Aakash Chopa, Drop MS Dhoni, Virat Kohli, Ravi Shastri, India team, India vs New Zealand, MS Dhoni in T20Is, MS Dhoni retirement, Cricket

Former Indian cricketers Aakash Chopra and Ajit Agarkar felt that MS Dhoni should make way for someone else in the T20 format

శ్రీలంకతో సిరీస్ కు ధోనిని ఎంపిక చేయకండీ..

Posted: 11/08/2017 08:55 PM IST
Time is ripe to try somebody else instead of ms dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. టీ20ల నుంచి ధోని తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందిగా వ్యాఖ్యలు చేసిన సీనియర్ల వాదనకు మరో గళం కూడా తోడైంది. మాజీ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, అజిత్‌ అగార్కర్ తరువాత మరో క్రికెటర్‌ చేరాడు. త్వరలో దక్షిణాఫ్రికాలో భారత్‌ పర్యటనను దృష్టిలో ఉంచుకోని శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు ధోనిని ఎంపిక చేయవద్దని వెటరన్ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డారు.

టీ20ల్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే జట్టు కార్యచరణను శ్రీలంకతో జరిగే సిరీస్ లోనే రూపోందించాలని ఓ స్పోర్ట్స్ వెబ్ సైట్ కు తెలిపాడు. శ్రీలంక సిరీస్ కు ఎంపిక చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జట్టును ఎంపికచేయాలన్నాడు. శ్రీలంకతో జరిగే టీ20లకు ధోని స్థానంలో యువ క్రికెటర్లను పరీక్షించాలని సెలక్టర్లకు సూచించాడు. గత కొద్ది రోజులుగా ధోని బ్యాటింగ్ లో వేగం తగ్గిందని, వేగంగా ఆడే యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారని వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.

న్యూజిలాండ్ తో రెండో టీ20లో ధోని నెమ్మదిగా ఆడటంతో అతనిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే సునీల్ గవాస్కర్‌, కెప్టెన్ కోహ్లిలు ధోని వెనకేసుకు రాగా ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20, మూడు టెస్టులు ఆడేందుకు లంక జట్టు బుధవారం భారత్ కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 16న కొల్‌కతాలో ప్రారంభంకానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  MS Dhoni  T20I  retirement  Ind vs NZl  VVS Laxman  Ajit Agarkar  Cricket  

Other Articles