రాజస్థాన్ కు చెందిన 15ఏళ్ల క్రికెటర్ అరుదైన రికార్డు సాధించాడు. తన బౌలింగ్‌లో ఒక్క పరుగు కూడా ప్రత్యర్థుల చేయనీయకుండా కట్టడి చేయడంతో పాటు ఏకంగా ప్రత్యర్థి జట్టు అటగాళ్లందరి విక్కట్లను తీసి తన ఖాతాలో వేసుకుని మరో రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు ఇదే మ్యాచ్ లో హ్యాట్రిక్ కూడా సాధించాడు. ఇన్ని చేసిందే ఒక్కే ఒక్కడు అకాష్ చౌదరి. అకాష్ చౌదరి అద్బుత విన్యాసంతో భావర్ సింగ్ టీ20 టోర్నమెంట్లో ఇది చోటు చేసుకుంది.
టోర్నీలో భాగంగా దిషా క్రికెట్ అకాడమీ- పర్ల్ అకాడమీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పర్ల్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన దిషా క్రికెట్ అకాడమీ జట్టు నిర్ణీత ఓవర్లలో 156 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పర్ల్ జట్టు స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. అందుకు కారణం దిషా జట్టుకు చెందిన బౌలర్ అకాశ్ చౌదరి. ఒక్క పరుగు ఇవ్వకుండా హ్యాట్రిక్ తో పాటుగా పది వికెట్లను తన ఖాతాలో వేసుకుని ప్రత్యర్థి జట్టును ఖంగుతినిపించాడు.
కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేసే టీ20 ఈ విధంగా పది విక్కెట్లు సాధించడం చాలా సంతోషంగా వుందని, అయితే దీనిని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అకాశ్ చౌదరి అన్నాడు. టీ20లో ఐదు వికెట్లు తీయడమే గొప్ప.. అలాంటి పది వికెట్లు.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా.. ఇది అదృష్టమేనని అన్నాడు. తాను టీమిండియా స్పీడస్టర్ జహీర్ ఖాన్ అభిమానినని చెప్పిన అకాశ్.. అతని బౌలింగ్ శైలి తనకెంతో ఇష్టమన్నాడు. ప్రస్తుతం అండర్-16 ఛాలెంజర్ ట్రోఫీకి సన్నద్ధమవుతున్నానని, అందులో తనకు స్థానం దక్కితే తన బౌలింగ్ అద్భుతాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశముందన్నాడు. ఆకాశ్ ఈ టోర్నీలో అవకాశం దక్కాలని అశిద్దాం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more