Nehra backs MS Dhoni to play in 2020 World T20 ధోని విమర్శకులకు నెహ్రా బదులు.. అదిరింది గురూ..!

I see dhoni playing the t20 world cup in 2020 says nehra

MS Dhoni,Dhoni retirement,Ashish Nehra,Dhoni T20I retirement,Dhoni future,Virat Kohli,kohli dhoni,Dhoni critics,India vs New Zealand,India vs Sri Lanka,MS Dhoni T20I future,Dhoni Laxman,Dhoni Agarkar, sports news,sports, latest sports news, cricket news, cricket

The former Indian pacer backed his former captain to play until the 2020 World T20 and said that Dhoni himself is the "best judge" of his future.

ధోని విమర్శకులకు నెహ్రా బదులు.. అదిరింది గురూ

Posted: 11/09/2017 06:26 PM IST
I see dhoni playing the t20 world cup in 2020 says nehra

న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆటతీరుపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక టీ 20ల నుంచి తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం కల్పించాలన్న వాదనను తెరపైకి తీసుకువచ్చిన వీవిఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కలకు ధీటుగా ఇప్పటికే భారత లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ధీటైన జవాబునివ్వగా.. అంతకంటే ధాటిగా జవాబిచ్చిన వారిలో చేరిపోయి ధోనికి మద్దతుగా నిలబడ్డాడు మాజీ టీమిండియా పేసర్ అశీష్ నెహ్రా.

ధోనీలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సరికాదని చెప్పాడు. ఒక మ్యాచ్ లో ఆడనంత మాత్రాన విమర్శిస్తారా? అని ప్రశ్నించాడు. అతని ఆటను అతడిని ఆడనివ్వాలని సూచించాడు. జట్టులోని క్రీకెటర్లందరూ అన్ని మ్యాచులలో రాణించలేరని, అయితే ఒక్కోక్కరికి ఒక్క సమయం ఎలా కలసివస్తుందో.. అలా కొందరికి కొన్ని సమయాలు కలసిరావని అన్నాడు. ధోని వయస్సు కారణంగానే టార్గెట్ చేస్తున్నారా..? అన్న అర్థవచ్చేలా ఆయన ప్రశ్నలను సంధించాడు.

అత్యంత నిజాయతీ గల క్రికెటర్లలో ధోనీ ఒకడని కితాబిచ్చాడు. 2020 వరల్డ్ టీ20 కప్ వరకు భారత జట్టులో ధోనీ కొనసాగుతాడనే నమ్మకం తనకుందని చెప్పాడు. ఒక ఫాస్ట్ బౌలర్ గా 39 ఏళ్ల వయసు వరకు తాను ఆడానని... ధోనీ ఫిట్ నెస్ చూస్తే కనీసం మరో మూడేళ్లయినా ఇండియాకు ఆడతాడని తెలిపాడు. సరైన సమయంలో కెప్టెన్సీని కోహ్లీకి అప్పజెప్పిన ధోనీకి, ఆట నుంచి ఎప్పుడు రిటైర్ కావాలో తెలియదా? అని ప్రశ్నించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  retirement  Ashish Nehra  vvs laxman  ajit agarkar  India vs New Zealand  cricket  

Other Articles