టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ప్రేమజంట ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే వారి వివాహన్ని ఇటు దేశంలోని ప్రముఖులతో పాటు విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖులు అభినందనలు తెలిపిన విషయం కూడా తెలిసిందే. కాగా ఓ బీజేపి నేతకు మాత్రం వారు ఇటలీలో పెళ్ళి చేసుకోవడంపై రుచించినట్టుగా లేదు. అందుకనే ఆయన ఏకంగా విరుష్కల వివాహాన్ని కూడా వివాదాస్పదం చేశారు.
మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ విరుష్క కల్యాణంపై బహిరంగ సభలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విక్రమాదిత్యుడు, యుధిష్ఠిరుడు వంటి మహనీయులు వివాహాలు చేసుకున్నారన్నారు. ఇంతటి గోప్ప దేశంలో.. అందులోనూ వివాహ వైశిష్టంపై, సంప్రదాయాలు వున్న దేశంలో కాకుండా ఎక్కడో పరదేశంలో పెళ్లి చేసుకోవడంపై ఆయన ప్రశ్నలు సంధించారు.
భారత దేశం లాంటి ఫుణ్యభూమిలో జన్మించి.. డబ్బు, పేరు, ప్రతిష్ఠలు సంపాదించుకుని విదేశాలలో వివాహం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. యువత విరుష్క జంటన అదర్శంగా తీసుకోకూడదని కూడా పిలుపునిచ్చారు. వీరిద్దరూ భారతదేశంలో ఎందుకు పెళ్ళి చేసుకోలేదని ప్రశ్నించారు. ఇక్కడి డబ్బు కావాలి, ఇక్కడ పేరు ప్రఖ్యాతులు కావాలి, కానీ విదేశాలలో పెళ్లిలా.? అంటూ ప్రశ్నించారు.
కాగా విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం బీజేపి నేత ప్రశ్నలపై ధీటుగానే సమాధానమిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఎక్కడ పెళ్లి చేసుకున్నాడన్న విషయం ప్రాధాన్యత సంతరించుకోదని, అయితే వారు ఏ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారన్నదే ముఖ్యమని వాదిస్తున్నారు. వారు హిందూ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more