Gavaskar Feels India Is Missing Dhoni ధోని టెస్టు క్రికెట్ కు వీడ్కొలు పలకాల్సింది కాదు..

Ms dhoni shouldn t have quit test cricket feel sunil gavaskar

MS Dhoni,sunil gavaskar,Parthiv Patel,Dinesh Karthik,India South Africa cricket,Wriddhiman Saha injury,Dinesh Karthik South Africa,India Cricket Team,cricket news,India wicketkeeper Tests, sports news, sports news, latest sports news, latest news

Gavaskar's comments come after Parthiv Patel dropped a few crucial catches in the ongoing second Test between India and South Africa in Centurion.

ధోని టెస్టు క్రికెట్ కు వీడ్కొలు పలకాల్సింది కాదు..

Posted: 01/17/2018 06:57 PM IST
Ms dhoni shouldn t have quit test cricket feel sunil gavaskar

దక్షిణాఫ్రికా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సఫారీలు నిర్ధేశించిన 286 టార్గెట్ ను చేధించే క్రమంలో భారత ఆటగాళ్లు విఫలం కావడంతో విమర్శలను ఎదుర్కోంటున్నారు. అయితే ఈ పరిణామాలను మూడో రోజు అటలోనే టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ముందుగానే ఊహించి మరో మాజీ టీమిండియా కెప్టెన్ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సింది కాదని తన మదిలోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తొలి టెస్ట్‌లో కీపర్‌గా వ్యవహరించిన సాహా.. ఆ మ్యాచ్‌లో గాయపడటంతో అతని స్థానంలో పార్థీవ్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మూడోరోజు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా బౌలింగ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ క్యాచ్‌ను కీపర్ పార్థీవ్ చాలా సులభంగా వదిలేశాడు. దీంతో అక్కడే మ్యాచ్ మలుపు తిరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత  క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తిం చేశారు.
 
అసలు ధోని టెస్ట్ జట్టులో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ధోని టెస్ట్‌ల నుంచి రిటైర్ కాకుండా ఉండాల్సింది. నాకు తెలుసు అతనిపై కెప్టెన్సీ భారం ఉందని, అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకొని కనీసం జట్టులో సభ్యుడిగా కొనసాగాల్సింది. ఎందుకంటే అతను డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లకు ఇచ్చే సలహాలు ఎంతో అమూల్యమైనవి’’ అని నాలుగో రోజు ఆట తర్వాత గవాస్కర్ అన్నారు.

ఇక సాహా స్థానంలో పార్థీవ్‌ని తీసుకోవడం గురించి మాట్లాడుతూ..‘‘రెండో టెస్టులో సాహా లేని లోటు స్పష్టంగా కనిపించింది. పార్థీవ్ చాలా పోటీతత్వం ఉన్న ఆటగాడు. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మూడో రోజు అతను ఒక అవకాశాన్ని(ఎల్గర్ క్యాచ్) చేజార్చాడు. అది కాస్త నిరాశపరిచింది. ఆ అవకాశన్ని అందుకొని ఉంటే.. మనకు ఈ సమస్యలు ఉండేవి కాదు’’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Gavaskar  MS dhoni  India VS South Africa  Test match  Cricket  

Other Articles