భారత క్రికెట్ దిగ్గజ అల్ రౌండర్ కపిల్ దేవ్ తో హార్దిక్ పాండ్యను పోల్చిన వారే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ లో జరిగిన టెస్టులో 93 పరుగులతో రాణించిన పాండ్య అందరి దృష్టిని ఆకర్షించగా, సెంచూరియన్ లో జరిగిన రెండో టెస్టులో ఆయన ఔట్ అయిన తీరు విమర్శలకు కారణమైంది. తొలి టెస్టులో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పాండ్యాను ప్రశంసించిన నోళ్లే రెండో టెస్టులో విమర్శలు గుప్పించాయి.
దీంతో రంగంలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విభిన్నంగా స్పందించాడు. ‘ఒకవేళ భవిష్యత్తులోనూ పాండ్య ఇలాంటి తప్పులు చేస్తే దయచేసి అతన్ని నాతో పోల్చవద్దు. అతనిలో చాలా ప్రతిభ ఉంది. కేప్‌టౌన్ టెస్టులో అది చూపించాడు. కానీ, సెంచూరియన్ టెస్టులో కీలకమైన సమయంలో పాండ్య పరుగు కోసం యత్నించి ఘోరంగా ఔటయ్యాడు. ఎంతో బాధ్యతగా ఆడాల్సిన మ్యాచ్‌లో ఇలా చేయడం ఎందుకు’ అని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కపిల్ దేవ్ వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ సమర్థించాడు. ‘నేను కపిల్‌తో కలిసి క్రికెట్ ఆడాను. హార్దిక్ పాండ్యను ఇప్పుడే కపిల్‌దేవ్‌తో పోల్చడం సరికాదు. 15ఏళ్ల పాటు కపిల్ దేశానికి సేవలు అందించాడు. మరపురాని విజయాలు అందించాడు. పాండ్య ఇప్పటి వరకు ఆడింది ఐదు టెస్టు మ్యాచ్‌లే. అప్పుడే కపిల్‌తో పోల్చడం సరికాదు’ అని పాటిల్ అన్నారు. పాండ్య ఔటైన వెంటనే కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ ‘ఇది క్షమించరాని తప్పు’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Today Hardik Pandya proved he is more dumber than Alia Bhatt. #SAvIND pic.twitter.com/xcpjuHDKDA
— Waѕiyullah Budye (@WasiyullahB) January 15, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more