దక్షిణాప్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 2-1 అదిక్యంతో కొల్పయిన క్రమంలో వినిపించిన విమర్శలు అదే జట్టుపై వన్డే సిరీస్ ను 5-1 తో గెలిచిన నేపథ్యంలో విమర్శకులు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వర్ణించేందుకు కొత్త ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొనుక్కోవాలని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీ సలహా ఇచ్చాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ..‘ విరాట్ కోహ్లీని పొగుడుతూ రాయడానికి బహుశా మీకు (మీడియాను టార్గెట్ చేసినా.. విమర్శకులపైనే ఆయన గురి) పదాలు కరువై ఉంటాయి. మీకు ఒక సలహా ఇస్తా. ఒకవేళ మీ స్థానంలో నేను ఉంటే నేరుగా బుక్ స్టోర్ కు వెళ్లి కొత్త ఆక్స్ఫర్డ్ నిఘంటువు కొనుక్కుంటాను. నా పద సంపదను పెంచుకుంటాను’ అని తెలిపాడు.
‘ బ్యాట్స్ మెన్ల యావరేజ్ బట్టి వారి అడలేదన్న నిర్ణయానికి రాకూడదని, వారు ఎలాంటి సమయంలో పరుగులు రాబడుతున్నారన్న దానిని పరిగణలోకి తీసుకోవాలని, ఆ పరుగులు జట్టు విజయానికి ఎంత కీలకంగా మారాయో గుర్తించాలని రవిశాస్త్రి సూచించాడు. ప్రపంచంలోని మేటి బ్యాట్స్ మెన్లలో కోహ్లీనే బెస్ట్ అని కితాబిచ్చాడు. అందుకు అతను సఫారీలతో అరు మ్యాచులలో సాధించిన 558 పరుగులే నిదర్శనమని శాస్త్రి అన్నాడు.
ఇప్పుడు జట్టు విజయంలో కుల్దీప్, చాహల్ ఇద్దరు స్పిన్నర్లు కీలకంగా మారారని అన్నారు. గతంలో టీమిండియాను ప్రత్యర్థి జట్ట మిడిల్ అర్డర్ వికెట్లను పడగొట్టమే సమస్యగా వుండేదని, కుల్దీప్ యాదవ్-చాహల్ తో అది తీరిందని అన్నాడు. వీరిద్దరూ మంచి ప్రదర్శన ఇస్తున్నారు. బ్యాటింగ్, ఫీల్డింగ్, స్పిన్ బౌలింగ్‌లో గొప్పగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విదేశీ పర్యటనలు చేయాల్సి ఉందని.. అలాంటి సమయంలో దక్షిణాఫ్రికా పర్యటన ప్రస్తుత భారత జట్టుకు ఎంతో నేర్పింది. యువ ఆటగాళ్లకు సఫారీగడ్డ మంచి అవకాశాన్ని అనుభవాన్ని పంచిందని అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more