ప్రపంచ కప్ టోర్నమెంటులో టీమిండియా మహిళా క్రికెట్ మ్యాచులకు కూడా మంచి అదరణ లభించడంతో బిసిసిఐ మహిళల ఐపీఎల్ కూడా ప్లాన్ చేస్తుందని, మరో రెండు మూడేళ్ల తరువాత ఈ ఐపీఎల్ కూడా అవిష్కృతం కానుందన్న విషయం ఇప్పటికే స్పష్టం చేసిన బిసిసిఐ.. మహిళల టీ20 క్రికెట్ ఛాలెంజ్ పేరుతో ఒక మ్యాచ్ ను నిర్వహించనుంది. ఇందుకోసం బరిలో దిగనున్న రెండు జట్లకు.. క్రికెటర్స్ స్మృతి మంథాన, హర్మన్ ప్రీత్ కౌర్ లకు కెప్టెన్లుగా కూడా ఎంపిక చేసింది.
మే- 22న ప్రత్యేకంగా నిర్వహించే ఏకైక టి20 చాలెంజ్ మ్యాచ్ లో పాల్గొనే రెండు జట్లకు వీరిద్దరు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నారు. ముంబైలో మే- 22న జరిగే IPL ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ కు ముందు ఈ ఉమెన్స్ మ్యాచ్ ను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్–1లో లైవ్ ఉంటుంది. న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్, సోఫీ డివైన్, ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, వికెట్ కీపర్ అలీసా హీలీ, మెగాన్ షుట్, బెథ్ మూనీ, ఇంగ్లండ్ అమ్మాయిలు వ్యాట్, హేజెల్ ఈ మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ప్రకటించారు.
టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన తర్వాత… ఉమెన్స్ క్రికెట్ కు మరింత ప్రాచుర్యం కల్పించే చర్యల్లో భాగంగా ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్లకు ఓ లీగ్ నిర్వహించాలని పలువురు బిసిసిఐకి సూచించారు. ఫలితంగా ఈ IPLలో భారత్ తోపాటు ఇంటర్నేషనల్ క్రికెటర్ల మధ్య ప్రయోగాత్మకంగా మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మ్యాచ్ లో పాల్గొనేందుకు ఆయా జట్ల క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు చేశారు.aNEWS: Women’s T20 Challenge Match to be played at Wankhede Stadium ahead of #VIVOIPL 2018 Qualifier 1.
— BCCI Women (@BCCIWomen) May 15, 2018
More details - https://t.co/Wnu0rVJnOG pic.twitter.com/qK0B6eTeco
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more