Preity Zinta's happiness at MI exit goes viral ప్రీతీ.. ఆటలో స్పోర్టివ్ స్పిరిట్ వుండాలి..

Preity zinta say very happy mi didn t qualify for finals

Preity zinta, Mumbai Indians, KXIP, Kings XI Punjab, IPL 2018, Delhi Daredevils, Chennai Super Kings, IPL, Panjab, OWNER, sensational comments, Mumbai Indians, Video viral, sports news,sports, latest sports news, cricket news, cricket

Though Kings XI Punjab failed to make it the IPL 2018 play-offs, franchise co-owner Preity Zinta has been caught on camera apparently delighted that defending champions Mumbai Indians did not progress beyond the league stage either.

ప్రీతీ.. ఆటలో స్పోర్టివ్ స్పిరిట్ వుండాలి..

Posted: 05/21/2018 02:53 PM IST
Preity zinta say very happy mi didn t qualify for finals

బాలీవుడ్ బ్యూటీ, ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కో-ఓనర్ ప్రీతిజింటా చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. ఆదివారం చెన్నై-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ కు హాజరైన ఈ సొట్టబుగ్గల సుందరి.. ఇటీవల అత్యల్ప పరుగుల తేడాతో తమ జట్టుపై ముంబై ఇండియన్స్ గెలవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ మ్యాచ్ అనంతరం అమె పూర్తిగా దు:ఖసాగరంలో మునిగారని టాక్. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుపై అమె సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న ఓ వీడియో కలకలం రేపుతోంది.
 
ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అదే సమయంలో తమ జట్టు మ్యాచ్ కోసం పుణెలో ఉన్న ప్రీతిజింటాకు ఈ విషయం తెలిసిందట. దీనికి సంతోష పడిపోయిన ఆమె ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముంబై ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. చాలా హ్యాపీగా ఉంది’’ అంటూ పక్కనున్న వ్యక్తితో అంటున్నట్లు టీవీల్లో ప్లే అయింది. దీనిని మొబైల్ లో వీడియో తీసిన ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆమెపై ముంబై అభిమానులు మండిపడుతున్నారు.

అయితే, తమ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకోవాలంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవాలి.. అలాగే చెన్నైను పంజాబ్ 53 పరుగుల తేడాతో ఓడించాలి. పంజాబ్ కోరుకున్నట్లుగానే ఢిల్లీ.. ముంబైను ఓడించింది. కాకపోతే పంజాబ్ కూడా చెన్నై చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. ముంబై ఓడిపోతేనే తమ జట్టుకు ఛాన్స్ ఉంటుందని భావించే ప్రీతిజింటా ఇలా అనుంటుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Did #PreityZinta just say “I am just very happy that Mumbai is not going to the finals..Really happy”

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL  Panjab  OWNER  sensational comments  Mumbai Indians  Video viral  cricket  

Other Articles