తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం అందుకున్న టీమిండియా...రెండో టెస్టులో విజయం కోసం శ్రమిస్తోంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో విరాట్ సేన విజయానికి 175 పరుగుల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆటముగిసే సరికి విరాట్ సేన 5 వికెట్లు కోల్పోయిన 112 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత ఓపెనర్లు మురళీ విజయ్, రాహుల్ విఫలమవ్వడంతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న చటేశ్వర్ పుజారా, విరాట్ కొహ్లీ, అజింక్య రహానే నిరాశపరచడంతో ఆస్ట్రేలియా మ్యాచుపై పట్టు బిగించింది.
మూడో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా.. భారత్ ముందు 287 పరుగుల లక్ష్యాన్నుంచింది. 50 పరుగులైనా నమోదు చేయకుండానే భారత జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ నాలుగో బంతికే టీమిండియా వికెట్ కోల్పోయింది. మిషెల్ స్టార్క్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఓపెనర్ కెఎల్ రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు. దాంతో స్కోర్ బోర్డ్‌పై పరుగులేమీ నమోదు కాకుండానే మొదటి వికెట్ కోల్పోయింది.
నాలుగో ఓవర్లో భారత్ కు మరో షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారాకు జోష్ హేజిల్ వుడ్ చెక్ పెట్టాడు. కీపర్ టిమ్ పెయిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి టెస్ట్ హీరో పుజారా సైతం 4 పరుగులకే ఔటవ్వడంతో 13 పరుగులకే భారత జట్టు రెండు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కోల్పోయింది. పుజారా ఔటైనా తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కొహ్లీ... ఓపెనర్ మురళీ విజయ్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించి భారత్‌ను పోటీలో నిలిపారు.
జట్టు స్కోర్ 48 పరుగులు వద్ద విరాట్ సైతం ఔటవ్వడంతో లక్ష్య ఛేదనలో వెనుకబడింది. 40 బంతుల్లో 17 పరుగులు చేసిన విరాట్..నాథన్ లియోన్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.కొద్దిసేపు పోరాడిన మురళీ విజయ్,బాధ్యతాయుతంగా ఆడిన అజింక్య రహానే సైతం ఔటవ్వడంతో భారత జట్టు మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులే చేయగలిగింది. ఆఖరి రోజు ఆటలో టీమిండియా విజయానికి 175 పరుగులు కావాలి. క్రీజ్‌లో రిషభ్ పంత్ (9), హనుమ విహారి (24) పరుగులతో క్రీజులో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more