Ishant and Jadeja fight with each other at perth పెర్త్ లో చొక్కాలు పట్టుకున్న ఇషాంత్, జడేజా

Perth test ishant sharma and ravindra jadeja fight with each other on the field

Ishant Sharma, Ravindra Jadeja, Ishant Jadeja fight, Perth Stadium, 2nd Test, India vs Australia, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India vs Australia, 2nd Test: Ishant Sharma, and Ravindra Jadeja were having a go at each other at the Perth Stadium and they had to be separated by Mohammed Shami and Kuldeep Yadav.

పెర్త్ లో చొక్కాలు పట్టుకున్న ఇషాంత్, జడేజా

Posted: 12/18/2018 03:49 PM IST
Perth test ishant sharma and ravindra jadeja fight with each other on the field

ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా ఈరోజు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ పెద్ద ఎత్తున గొడవపడిన ఘటన ఒక్కరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటలో నాలుగోరోజైన సోమవారం ఫీల్డింగ్‌ కూర్పులో భాగంగా తలెత్తిన వివాదం.. తారాస్థాయికి చేరడంతో ఒకానొక దశలో జడేజాపైకి దూసుకెళ్లిన ఇషాంత్ శర్మ.. చేయి చేసుకునేలా కనిపించాడు. అయితే.. అప్పటికి అక్కడికి చేరుకున్న మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ వారిని విడదీసి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

కానీ.. ఈ వీడియో మంగళవారం వెలుగులోకి రావడంతో.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పరువు తీసేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి పెర్త్ టెస్టు తుది జట్టులో రవీంద్ర జడేజా లేడు. కానీ.. నిన్న మధ్యలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన జడేజా.. బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మకి లాంగాన్, లాంగాఫ్‌లో ఫీల్డర్ల కూర్పుపై సలహాలివ్వబోయాడు. . దీంతో.. చిర్రెత్తిపోయిన ఇషాంత్ శర్మ అతడిపై నోరుజారాడు. దీంతో.. జడేజా కూడా అదేరీతిలో స్పందించడంతో.. సహనం కోల్పోయిన ఇషాంత్ శర్మ.. అతడిపైకి దూసుకెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది.

నోబాల్ ఒత్తిడి కారణంగా.. ఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో లయ తప్పడంతో.. అతడ్ని లక్ష్యంగా చేసుకుని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పరుగులు సాధిస్తున్న తరుణంలో జడేజా సలహాలివ్వడం అతనికి కోపానికి ఓ కారణంగా తెలుస్తోంది. మ్యాచ్‌లో 287 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు 140 పరుగులకే ఈరోజు కుప్పకూలిపోయింది. దీంతో.. 146 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-1తో సమం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles