దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎంపికైన ఉమేశ్ యాదవ్.. విజయనగరం వేదికగా జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తేలిపోయాడు. బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్, దక్షిణాఫ్రికా మధ్య ఈ మ్యాచ్ జరుగుతుండగా.. రెండో రోజైన శుక్రవారం సఫారీ బ్యాట్స్మెన్లకి మంచి ప్రాక్టీస్ లభించింది. తొలిరోజైన గురువారం వర్షం కారణంగా ఆట రద్దయిన విషయం తెలిసిందే.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (6)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ మర్క్రమ్ (100 రిటైర్డ్ హర్ట్: 118 బంతుల్లో 18x4, 2x6) శతకంతో చెలరేగాడు. దీంతో.. ఈరోజు వర్షంతో ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 199/4తో నిలిచింది. బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ టీమ్ బౌలర్లలో ధర్మేంద్ర సిన్హా జడేజా రెండు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్, ఇషాన్ పోరెల్ తలో వికెట్ తీశారు.
రెండు రోజుల క్రితం జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ని టెస్టు జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేశారు. విశాఖపట్నం వేదికగా అక్టోబరు 2 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ కల్పించే ఉద్దేశంతో ఉమేశ్‌ని ఆడించగా.. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ ఆరంభంలో రెండు మూడు ఓవర్లు మినహా ప్రభావం చూపలేకపోయాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more