Maria sharapova has no clue who is sachin tendulkar

sachin tendulkar, maria sharapova, cricket world, Maria Sharapova has no clue who is Sachin Tendulka, champions Maria Sharapova

Maria Sharapova has no clue who is Sachin Tendulka

సచినా ? ఆయనెవరు ? షరపోవా

Posted: 07/02/2014 04:52 PM IST
Maria sharapova has no clue who is sachin tendulkar

ప్రపంచ దేశాల ఆటగాళ్లే కాకుండా, ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ కి ఎనలేని సేవలు అందించి, ఎన్నో అవార్డులతో పాటు అంత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న అవార్డును కూడా అందుకున్న సచిన్ టెండూల్కర్ ప్రపంచదేశాలకు కూడా సుపరిచతమే. అంత గొప్ప వ్యక్తి తనకు మాత్రం తెలియదంటుంది  టెన్నిస్ ఆటకు రారాణి, పలు గ్రాండ్ స్లామ్ లు గెల్చుకున్న విజేత మరియా షరపోవా. క్రికెట్ తరువాత ఎక్కువ తానిష్టపడే టెన్నిస్ ని చూడటానికి అదీ లండన్ వింబుల్డన్ చూడటానికి సచిన్ వీలుచిక్కినప్పుడల్లా వెళుతుంటాడు.

ఇటీవల లండన్ లో జరుగుతున్న పోటీలకు వెళ్లాడు. ఐదు రోజుల కిందట (శనివారం) జరుగుతున్న మ్యాచ్ ను వీక్షించేందుకు రాయల్ బాక్స్ సీటులో ఇంగ్లిష్ ఫుట్ బాలర్ డేవిడ్ బెక్ హామ్, గోల్ఫర్ ఇయాన్ పౌల్టర్ ల సరసన సచిన్ కూడా కూర్చున్నాడు. ఆ సమయంలో ఓ విలేఖరి సచిన్ మీకు తెలుసా అని అడిగితే... వెంటనే సచిన్ ఎవరో నాకు తెలియదు అని సమాధానం చెప్పినట్లు టెన్నిస్ వరల్డ్. ఓఆర్ జీ తన కథనంలో తెలిపింది. అయితే షరపోవా తెలిసి చెప్పిందో, తెలియక చెప్పిందో కానీ క్రికెట్ అభిమానులు మాత్రం ఆమె చెప్పిన సమాధానానికి బిత్తర పోతున్నారు. ఎంత గొప్ప క్రీడాకారిణి అయినా ప్రపంచ స్టార్ ఆటగాడు అయిన సచిన్ గురించి తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles