Jwala gutta to start badminton academy soon

jwala gutta to start badminton, telangana state government, gutta jwala, hyderabad, jwala gutta to start badminton academy soon

jwala gutta to start badminton academy soon

జ్వాలా అకాడమీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Posted: 07/03/2014 10:43 AM IST
Jwala gutta to start badminton academy soon

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మరో అవతారం ఎత్తబోతుంది. క్రీడా కారిణి నుండి సినిమాల్లో ఐటెం గాళ్ అవతారం ఎత్తిన ఈ అమ్మడు అక్కడ సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ ఆట పై దృష్టి సారించింది. ఇప్పుడు అకాడమీ పెట్టి త్వరలో కోచ్ గా మారబోతుంది. త్వరలో తన పేరుతో అకాడమీని ప్రారంభించబోతుంది. తన పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించడానికి  తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ కి పంపిన ప్రతిపాదనల్ని సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది.

కొత్తగా భూమి కేటాయింపు తరహాలో కాకుండా, అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆమెకు సూచించినట్లు సమాచారం. ఈ అకాడమీ కోసం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియాన్ని లీజు ప్రాతిపదికన ప్రభుత్వం జ్వాలకు ఇస్తుంది. అక్కడే ఆమె చిన్నారులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ అకాడమీని జ్వాల పేరుతో నిర్వహణ సాగిస్తారు.

ఈ అకాడమీకి అనుమతులు రావడానికి తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి కేటీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆమెకు సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఆటలోనే కొనసాగుతున్నందున ఆమె పూర్తి స్థాయి కోచ్ గా కాకుండా, కొంతమంది కోచ్ ల సహాయంతో చిన్నారులకు బ్యాట్మింటన్ లో శిక్షణ ఇవ్వనుంది. ఈమె అకాడమీలో బ్యాట్మింటన్ ఆణిముత్యాలు బయటకు వస్తారో, లేక ఐటెంగాళ్స్ బయటకు చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles