సాకర్ ప్రపంచకప్ లో నెదర్లాండ్ ను ఫెనాల్టీ షూటౌట్ తో బొల్తా కొట్తించి, ఎన్నో ఏళ్ల తరువాత ఫైనల్ కి చేరి కప్ ని కైవసం చేసుకోవడానికి జర్మనీతో అమీ తుమీకి సిద్దం అయింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో తలపడ్డ అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లు పట్టువీడకుండా ఆటను అదనపు సమయానికి తేవడంతో పాటు, పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా 4 గోల్స్ కొట్టగా, నెదర్లాండ్స్ 2 గోల్స్ మాత్రమే కొట్టడంతో విజయం అర్జెంటీనాను వరించింది.
తొంబై నిమిషాల పాటు ఇరు జట్లు హోరా హోరీగా పోరాడినా, గోల్స్ చేయడానికి అద్బుత అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాయి. దీంతో ఫెనాల్టీ షూటౌట్ కావాల్సి వచ్చింది. పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా గోల్ కీపర్ రోమెరో నెదర్లాండ్స్ ఆటగాడు వార్ల్ కొట్టిన తొలి గోల్ ని అడ్డు కోవడంతో అర్జెంటీనాకు ఆధిక్యం లభిచింది.
పెనాల్టీ షూట్ ఔట్ లో... అర్జెంటీనా తరపున మెస్సీ, గరాయ్, ఆగ్యురో, రోడ్రోగెయిజ్ గోల్స్ కొట్టారు. నెదర్లాండ్స్ తరపున రాబెన్, కుయుట్ గోల్స్ కొట్టడంలో సఫలీకృతం కాగా... వ్లార్, స్నైడర్ లు విఫలమయ్యారు. దీంతో, 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ఫెనాల్టీ షూట్లను అడ్డుకున్న అర్జెంటీనా గోల్ కీపర్ రోమెరోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ లభించింది. అర్జెంటీనా విజయంతో ఆదేశం ఆనందంలో మునిగిపోయింది.
Knr
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more