క్రీడారంగంలో అద్భుతంగా రాణిస్తున్న కొందరు క్రీడాకారులు సినీపరిశ్రమ, బుల్లితెరల వైపు తమ దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఎందరో తమ అదృష్టాన్ని ఆ రెండు రంగాల్లో పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా సైనా నెహ్వాల్ కూడా చేరిపోయింది. బ్యాడ్మింటన్ లో అద్భుతంగా రాణిస్తున్న ఈ అమ్మడు.. త్వరలోనే బుల్లితెరపై కనువిందు చేయనుంది. ఇన్నాళ్లూ తన బ్యాడ్మింటన్ బ్యాట్ తో ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించి ఎందరో క్రీడాభిమానుల్ని సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు నటనవైపు అడుగులు వేసి అందరినీ ఆకర్షిస్తోంది.
హిందీలో ‘హర్ ఘర్ కుఛ్ కెహతా హై’ పేరిట ఓ సీరియల్ తెరకెక్కుతోంది. ఈ సీరియల్ లోనే సైనా నెహ్వాల్ నటిస్తోంది. ఇందులో ఈమెతోపాటు బాలీవుడ్ హాస్యనటుడు వినయ్ పాఠక్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని అమ్మడు తన ట్విటర్ లో వెల్లడించింది. అంతేకాదు.. షూటింగ్ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. సైనా నెహ్వాల్ ఈ సీరియల్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తోందా..? లేక కేవలం రెండు మూడు ఎపిసోడ్లకు గెస్ట్ పాత్రలో నటిస్తోందా? అన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ సందేహం కాస్త పక్కన పెడితే.. ఈ సీరియల్ లో నటించేందుకు అవకాశం వచ్చినందుకు అమ్మడు ఉబ్బితబ్బిబ్బవుతోందని సన్నిహిత వర్గాలు పేర్కొంటాయి.
ఇదిలావుండగా.. గతంలో ఓ సందర్భంలో తనకు నటన అంటే చాలా ఇష్టమని సైనా నెహ్వాల్ పేర్కొంది. కానీ.. తనకు బ్యాడ్మింటన్ మీదే ఎక్కువ దృష్టి అని పేర్కొంటూనే.. నటించే అవకాశమొస్తే, అందుకు వీలుంటే ఖచ్చితంగా నటిస్తానని తెలిపింది. ఇప్పుడు ఆ అవకాశం రావడంతో ఈమె సద్వినయోగం చేసుకుంటోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఏదేమైనా.. తెరమీద కనిపించాలనే ఆమె కోరిక బుల్లితెర ద్వారా తీరనుందని చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more