రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. అ తరువాత రెజ్లర్ సందీప్ తులసి.. ఇక తాజాగా షార్ట్ పుట్ క్రీడాకారుడు ఇంద్రజీత్ సింగ్.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. భారత క్రీడాకారులందరూ డోపింగ్ టెస్టులో పట్టుబడుతున్నారు. పతకాలు సాధిస్తారన్న నమ్మకం వున్న భారతీయ క్రీడాకారులందరూ డోపింగ్ టెస్టులో పట్టుబడుతుండటం విస్మయానికి దారితీస్తుండగా, పలు అనుమానాలకు కూడా తావిస్తుంది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోపింగ్ టెస్టుల్లో తాను కూడా పట్టుబడినట్లు వార్తలు విని షాక్ గురయ్యానని ఇందర్జిత్ సింగ్ అన్నాడు. తనకు ఏ పాపం తెలియదంటున్నాడు.
షాట్ ఫుట్ విభాగంలో రియోలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్ ఇందర్జిత్ సింగ్ గతనెల 22న నాడా జరిపిన డోప్ టెస్టుల్లో 'ఏ' శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చింది. ఆండ్రోస్టెరాన్, ఎటికోలనోలోన్ అనే రెండు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అతడి రియో అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎవరో కావాలని తనపై కుట్రపన్నారని, తాను ఇచ్చిన శాంపిల్స్ లో ఏదో తేడా జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశాడు. తనపై దుష్రచారం చేసి తన నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయాడు.
ప్రస్తుతం తాను ఈ విషయంపై మాట్లాడేస్థితిలో లేనని, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే వాళ్లు ఎలాంటి ఉత్ప్రేరకాలను తీసుకోరని షాట్ ఫుటర్ చెప్పాడు. తనను ఉద్దేశపూర్వకంగా డోపింగ్ వివాదంలో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించాడు. గతేడాది 50 సార్లు డోప్ టెస్టుల్లో పాల్గొన్నాను, ఈ ఏడాది కూడా అడిగిన ప్రతిసారి శాంపిల్స్ ఇచ్చానని ఇందర్జిత్ తెలిపాడు. అతడు 'బి' శాంపిల్స్ టెస్టు చేయించుకుని డోపింగ్ వివాదం బయటపడాల్సి ఉంటుంది. అయితే 'బి' శాంపిల్స్ లోనూ పాజిటివ్ వస్తే అతడిపై నిషేధంతో పాటు రియోకు వెళ్లకుంటా వేటు పడుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more