డోపింగ్ టెస్టులో విఫలమైన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు రియో ఒలంపిక్స్ కు వెళ్లేందుకు దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయాయి. అంటే 74 కేజీల రెజ్లింగ్ విభాగంతో భారత్ ప్రాతినిధ్యం లేనట్లేనా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నర్సింగ్ యాదవ్ స్థానంలో ఆయనతో బరిలోకి దిగేందుకు పోటీ పడిన ఢిల్లీకి చెందిన సుశీల్ కుమార్ కు అవకాశాలు దక్కనున్నాయా..? లేదా..? అంటే అది కూడా కష్టమేనని వెల్లడవుతుంది. సుశీల్ కుమార్ ను ఒలంపిక్స్ కు పంపేందుకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ గతంలో వెల్లడించినట్లుగానే ఆయనకు నిబంధలను అడ్డుగా మారనున్నాయి.
ఇక డోపింగ్ ఫలితాలలో నర్సింగ్ యాదవ్ కు భారత్ రెజ్లింగ్ లో పాల్గోనేందుకు వీలు లేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మరి భారత్ రెజ్లింగ్ ఫెడరేషన్ తాజా పరిణామాలపై ఏలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. భారత్ తప్పకుండా పతకం సాధించిపెట్టే ఈ క్రీడా విభాగంలో భారత్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఎలా ముందుకు వెళ్లనుంది. రియోలో పాల్గోనేందుకు ఇద్దరు అభ్యర్థులు నువ్వ-నేనా అన్నట్లుగా పోటీ పడి.. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టే వరకు వెళ్లారు. ఒక క్రీడాకారుడిని పక్షాన నిలిచి అతనే అంతా అనేలా ఫెడరేషన్ వ్యవహరించకుండా.. ఇద్దరి అభ్యర్థులకు అవకాశం లేని సందర్భంగా ఒకరిని పంపి మరోకరిని రిజర్వులో పెడుతున్నామని వుండి వుంటే నర్సింగ్ యాదవ్ తప్పనిసరి పరిస్థితులలో వెనుదిరిగినా.. సుశీల్ కుమార్ కు అవకాశం వుండేది.
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ జరిపిన డోపింగ్ టెస్టుల్లో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రెండు శాంపిల్స్ పాజిటివ్ గా రావడంతో అతడికి రియో దారులు దాదాపు మూసుకుపోయిన తరుణంలో క్రీడాకారుడికి బదులుగా క్రీడకు ప్రాధాన్యత ఇచ్చివుంటే పరిస్థితి ఇలా వుండేది కాదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే నర్సింగ్ యాదవ్‌కు రెజ్లింగ్ సమాఖ్య పూర్తి మద్ధతు తెలిపింది. నర్సింగ్ డోపింగ్ టెస్టుల్లో విఫల వెనుక కుట్ర జరిగిందని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజిభూషన్ శరణ్ సింగ్ ఆరోపించాడు. క్రీడలతో సంబంధం ఉన్నవాళ్లే నర్సింగ్ యాదవ్‌ను ఉద్దేశపూర్వకంగానే డోపింగ్ వివాదంలో ఇరికించారని, రెజ్లర్ ఏ తప్పిదం చేయలేదని పేర్కొన్నాడు.
ఇలాంటి వ్యాఖ్యలతో ఇకపై తాను వెళ్లాలనుకున్న స్థానంలో తన ప్రత్యర్థి వెళ్తే.. వారిని ఇలా కూడా బుక్ చేయవచ్చునని ప్రత్యర్థులకు అలోచించేలా చేస్తుంది. అలా కాకుండా బరిలో నిలిచే అభ్యర్థులతో పాటు, అదే స్థాయిలో నిలిచే క్రీడాకారులకు కూడా సమాఖ్య మద్దతు ఇచ్చి.. వారిని రిజర్వులో పెట్టివుంటే.. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావు. నర్సింగ్ యాదవ్ అమాయకుడా..? కాదా..? అన్నది అసలు ప్రశ్నే కాదు. అయనకు సమాఖ్య మద్దతు వుందా..? లేదా..? అన్నది కూడా ప్రశ్న కాదు.. భారత దేశానికి ఖచ్చితంగా వస్తుందనుకున్న ఓ పతకం చేజారి పోతుందేనన్నదే అసలు ప్రశ్న. ఈ దిశగా సమాఖ్య అలోచన చేయాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more