Hearing in Narsingh Yadav case adjourned till July 28, NADA yet to put their side

Rio olympics nada to take final call on narsingh yadav tomorrow

narsingh yadav,narsingh yadav doping, narsingh yadav doping test, narsingh yadav sports authority of india, narsingh yadav sai, narsingh yadav vijay goel, vijay goel, vijay goel sports minister, pm modi, narendra modi, rio 2016 olympics, rio olympics, rio 2016, rio, olympics, wrestling

Narsingh Yadav will know his fate of going or not going to Rio 2016 Olympics on July 28 as National Anti-Doping Agency yet to put its side on Thursday.

నేడు తెలనున్న నర్సింగ్ యాదవ్ రియో భవితవ్యం

Posted: 07/27/2016 09:40 PM IST
Rio olympics nada to take final call on narsingh yadav tomorrow

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రెండో ధపా జరిపిన డోపింగ్ టెస్టులోనూ విఫలమయ్యాడు, దీంతో ఆయన రియో ఒలంపిక్స్ గేమ్స్ లో పాల్గోనే అవకాశాలపై నీలినీడలు అలుముకున్నాయి, తాజాగా జూలై 5న నిర్వహించిన రెండో డోపింగ్ టెస్టులోనూ విఫలమయ్యాడు. తొలిసారిగా జూన్ 25న నిర్వహించిన డోపింగ్ టెస్టులో నర్సింగ్ యాదవ్ దోషిగా తేలాడు. అయితే ఈ విషయంలో తనపై కుట్ర జరిగిందని ఆయన అరోపించాడు, కాగా రెండో సారి నిర్వహించిన డోపింగ్ టెస్టులోనూ ఆయన విఫలం కావడంతో ఆయన రియో ఒలంపిక్స్ గేమ్స్ లో పాల్గొనడంపై నీలినీడలు అలుముకున్నాయి. ఇదిలా వుండగా, ఆయన డోపింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టిన నాడా గురువారం కూడా నర్సింగ్ యాదవ్ తరపు న్యాయవాదుల నుంచి వారి వాంగ్మూలాన్ని విననుంది, దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయమై ఉత్కంఠ మరికోన్ని గంటల వరకు కొనసాగనుంది.

కాగా అంతకుముందు విజయం కోసం అడ్డదారులు వెతుక్కోవడం చేతకానితనమే. సామర్థ్యాన్ని చూపి ప్రత్యర్థిపై గెలిస్తేనే జనం మెచ్చుకుంటారు. ఒలింపిక్స్ క్రీడల్లో సత్తా చాటాలని కలలుగన్న నర్సింగ్ యాదవ్‌కు దుర్మార్గమైన ప్రత్యర్థి వల్ల అన్యాయం జరిగిందని సమాచారం. సూపర్ హెవీ వెయిట్ కేటగిరిలోని అంతర్జాతీయ రెజ్లర్ ఒకరు తన సోదరుడి ద్వారా నర్సింగ్ యాదవ్ ఆహారాన్ని కల్తీ చేసినట్లు కేసు నమోదయిందని, ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. సోనేపట్‌లోని సాయ్ సెంటర్ వర్గాల సమాచారం ప్రకారం ఆ దుష్ట రెజ్లర్ జూనియర్ ర్యాంక్స్‌లో 65 కేజీల విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినట్లు తెలుస్తోంది.
 
ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో అతను శిక్షణ పొందుతున్నాడు. నేషనల్ క్యాంపులు జరిగేటపుడు సోనేపట్‌లోని సాయ్ సెంటర్‌కు స్పారింగ్ పార్టనర్‌గా తరచూ వస్తూ ఉండేవాడట. నర్సింగ్ యాదవ్ శిక్షణ కోసం బల్గేరియాలో ఉన్నపుడు సాయ్‌ సెంటర్‌లోని అతని గది వద్ద అనుమానితుడు సంచరిస్తూ ఉండేవాడని, కేడీ జాదవ్ హాస్టల్‌లోని ఆ గది తాళాల గురించి కూడా అతను వాకబు చేశాడని చెబుతున్నారు. ఆ తాళాలు నీకెందుకు? అని ఓ వ్యక్తి ప్రశ్నించినపుడు అమాయకత్వాన్ని నటిస్తూ ఈ గది పవన్‌ది కదా? అని తిరిగి ప్రశ్నించాడట.

హర్యానా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం నర్సింగ్ యాదవ్ సమల్ఖా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను తాగే నీటిని, ఆహార పదార్థాలను కొందరు కల్తీ చేసినట్లు అనుమానం ఉందని ఆరోపించారు. దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలైందని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ తెలిపింది. సాయ్ సెంటర్‌లో సీసీటీవీ కవరేజ్ ఉంది, కానీ కేవలం 10 రోజుల ఫుటేజిని మాత్రమే ఉంచుతారు. అందువల్ల అనుమానితుడి సంచారం గురించి ఫుటేజి లేదని సమాచారం. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narsing Yadav  NADA  wrestler  Rio Olympics  doping case  

Other Articles