తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు హీరో నాని! ఈ గుర్తింపే ఇతనికి ‘ఈగ’లాంటి భారీ చిత్రంలో నటించేలా చేసింది. ఆ చిత్రం ఇతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతోపాటు కెరీర్ కి ఎంతో హెల్ప్ అయింది. ఆ చిత్రం తర్వాత ఇతినికి ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే.. వాటిల్లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిపోవడంతో నాని పనైపోయిందని అంతా అనుకున్నారు. దీంతో తనను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే హిట్ కోసం ఈ హీరో కొన్నాళ్లపాటు ఎదురుచూశాడు. ఈ క్రమంలోనే ఇతనికి ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలు మంచి కమర్షియల్ విజయాలను అందిచ్చాయి. ఈ సక్సెస్ తో నే ఇతనికి మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే దర్శకుడు మారుతీతో కలిసి నాని ‘భలే భలే మగాడివోయ్’ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మరోవైపు.. ‘అందాల రాక్షసి’ సినిమాతో ఓ అందమైన ప్రేమకథను అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలోనూ నాని ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘భలే భలే మగాడివోయ్’ షూటింగ్ పూర్తి కాగానే నాని ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ కూడా పూర్తైనట్లు దర్శకుడు హను తెలియజేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వంలో రూపొందే ఈ ఆల్బమ్‌లోని పాటలన్నీ మంచి రిఫ్రెషింగ్ ఫీల్‌ని ఇస్తాయని దర్శకుడు తెలిపారు.
ఈ విధంగా నాని తన రెండు సినిమాల షూటింగులతో బిజీగా కాలం గడుపుతున్నాడు. ఈ రెండు చిత్రాలు తనకు మంచి విజయాన్ని అందిస్తాయని నాని వెల్లడిస్తున్నాడు. అటు ఆయా మూవీల యూనిట్ సభ్యులు కూడా ఆ రెండు సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కుతున్నాయని, ప్రేక్షకులకు మెచ్చే విధంగా రూపొందుతున్నాయని అభిప్రాయం వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more