సాధారణంగా ప్రకృతిలో లభించే రకరకాల పళ్లు అనేక రకాల పోషకాలను కలిగి వుంటాయి. కొన్ని పళ్లు సీజనల్ గా లభిస్తే.. మరికొన్ని నిరంతరం మార్కెట్ లో అందుబాటులో వుంటాయి. మామూలుగా కొన్ని పళ్లలో సహజంగానే పోషకాలను, ఔషద గుణాలను కలిగి వుంటాయి. అందులో ఒకటి ఈ ద్రాక్ష పండు.
వేసవి కాలంలో ఈ ద్రాక్షపండు చల్లగా వుండటమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. శరీరంలో వచ్చే అజీర్తి సమస్య నుంచి కంటి సమస్యలదాకా వచ్చే అనేక రకాల వ్యాధులను నియంత్రించడంలో ఇది ప్రముఖపాత్రను వహిస్తుంది.
ద్రాక్షపండులో చాలా మోతాదులో విటమిన్ ‘సి’ లభిస్తుంది. అంతేకాదు.. ఇందులో విటమిన్ ‘ఏ’, బి6, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలు వుంటాయి. వీటితోపాటు ఖనిజలవణాలు అయిన పొటాషియం, ఇనుము, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో ఈ ద్రాక్ష పండులో సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ముఖ్యమైన యాంటి ఆక్సిడెంట్లు అయిన ఫ్లేవినాయిడ్స్ ఫ్రీ రాడికల్ బారినుంచి కాపాడుతుంది. వయసు ప్రభావం వల్లే ముడతలను చాలావరకు తగ్గిస్తుంది.
వీటి వల్ల కలిగే ప్రయోజనాలు :
ద్రాక్షపళ్లలో వుండే టీరోస్టిల్ బీన్ అనే పదార్థం రక్తంలో వుండే కొలెస్టిరాల్ మోతాదును తగ్గించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా రక్తంలో వుండే నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచడంలో ఇది సహాయపడుతుంది. తద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం వుండదు.
మలబద్ధకం (Constipation)తో బాధపడుతున్నవారికి ఈ ద్రాక్ష ఒక ముఖ్యమైన ఔషదగుణంగా పనిచేస్తుంది. ఇందులో కర్బన్ ఆమ్లాలు, చక్కెర పదార్థాలు ఎక్కువగా వుండటం వల్ల ఇవి మంచి పోషకాలుగా పనిచేస్తాయి. ఇందులో వుండే ఆక్సిడెంట్లు శరీరంలో వుండే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతాయి. అంతేకాదు... బాక్టీరియా, వైరస్ ల ఇన్ ఫెక్షన్ ను నిరోధించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రస్తుత అధ్యయనాల ప్రకారం నల్లద్రాక్షలు తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చునని తెలుస్తోంది. ఈ పళ్లుఆంథ్రోసయనిన్లు, ప్రోఆంవూథోసయనిన్లు యాంటి ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగివున్నాయి. ఇవి క్యాన్సర్ కారక పదార్థాలను శరీరం నుండి విడుదల కాకుండా వాటిని నిరంతరం నిరోధిస్తాయి.
ద్రాక్షపళ్లను నిరంతరం తీసుకోవడం వల్ల కంటిలో వున్న శుక్లాలు తగ్గిపోకుండా కాపాడుతాయి. ద్రాక్షలో వుండే ఫ్లేవినాయిడ్లు చాలా శక్తివంతమైనవి. ఇవి ఫ్రీరాడికల్స్ దాడిని ఎదుర్కోవడంలో చురుకుగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. మెదడు చురుకుదనాన్ని పెంచడంలోను ఇవి తమవంతు పాత్రను పోషిస్తాయి. న్యూరోజనరేటివ్ వ్యాధులను నివారించడంలో ద్రాక్షపండ్లు చాలావరకు సహకరిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more