సాధారణంగా జలుబు సమస్య ప్రతిఒక్కరికి వస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారివరకు వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అయితే ఇది తరుచుగా, ఎప్పుడుపడితే అప్పుడు ఇబ్బంది కలిగిస్తే మాత్రం కొంచెం ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు.
శ్వాసకోశకు సంబంధించిన సమస్యలతో అనేక రకాలుగా బాధపడుతుంటారు. ముఖ్యంగా తుమ్ములురావడం, ముక్కు నుంచి నీళ్లు కారడం, ముక్కులో మంటగా వుండటం, కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు - చెవులు అంగిలిదురదగా వుండటం, ముక్కు బిగుసుకుపోవడం వంటి అనేక రకాల లక్షణాలతో ఇబ్బందిపడుతుంటారు. కానీ ఇటువంటి లక్షణాలు ప్రతిసారి సంభవిస్తే.. దానిని అలర్జీ అంటారు.
ఈ సమస్య ఏర్పడిన తరువాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మన శ్వాసకోశ దెబ్బతినడమే కాకుండా.. ప్రాణానికే ఎంతో ప్రమాదకరం హెచ్చరిస్తున్నారు వైద్యులు.
వ్యాధిని నిర్ధారించుకోవడం...
కొందమందిలో ఈ సమస్య వచ్చినప్పుడు రక్తంలో వుండే ఇస్నోఫిల్స్ శాతం పెరుగుపోతుంది.
అలాగే ఎక్స్ రే వంటి పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ముక్కులోపల వుండే కండ ఉబ్బినట్టుగా వుంటుంది. దాంతో శ్వాస పీల్చుకోవడం చాలా కష్టతరం అవుతుంది.
అలాగే చర్మానికి సంబంధించిన స్కిన్ సెన్సిటివిటీ పరీక్షలు చేయించుకోవడంతో... ఏ ఆహారం తీసుకోవడం వల్ల ఈ అలర్జీ సమస్య వస్తుందో తెలుసుకొని నిర్ధారించుకోవచ్చు.
కారణాలు...
సహజంగా జలుబు వచ్చిన ప్రతిసారి ముక్కలో వుండే మ్యూకస్ పొర విపరీతంగా స్పందించడం వల్ల ముక్కు నుంచి నీళ్ల కారడం, తుమ్మలు రావడం అలాగే నీటినుంచి నీళ్లు రావడం జరుగుతుంది.
అయితే కొంతమందిలో దుమ్ము, ధూళి వంటి కణాలు ముక్కులో చేరడం వల్ల... వాటిని బయటికి పంపించడంలో ఈ పొర స్పందించి, వాటిని బయటికి నెట్టుతుంది. కానీ ఎటువంటి కారణాలు లేకపోకుండానే నిత్యం జలుబు సమస్యలు ఏర్పడితే... అది అలర్జీ ప్రభావమే అభ్యంతరం లేకుండా అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఇలా సంభవించినప్పుడు వాటికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తే.. అలర్జీ సమస్య నుంచి బయటపడే అవకాశాలు వుంటాయి.
జలుబు రావడానికి గల కారణాలు...
వాతావరణ పరిస్థితులలో వచ్చే మార్పుల వల్ల జలుబు అనే సమస్య తలెత్తుతుంది. చల్లని వాతావరణంలో వుండటం ద్వారా ఇది మరీ త్వరగా వ్యాపించే అవకాశాలుంటాయి. అలాగే చల్లని ఆహారపదార్థాలు, వాతావరణంలో వచ్చే వివిధ కాలుష్య ప్రభావాల వల్ల, చల్లని ప్రాంతం నుండి ఒక్కసారిగా వేడి వాతావరణంలోకి రావడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు వున్నాయి.
నివారించే మార్గాలు...
సాధారణంగా ఈ జలుబుకు సంబంధించిన అలర్జీ ఒకే విధంగా వుండదు. కొందరికి వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తుంది... లేదా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ముఖ్యంగా చల్లని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తరుచుగా వస్తుంటుంది.
వాతావరణమార్పుతో బాధపడేవారు పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు వహిస్తే... అంటే ముక్కుకు మాస్క్ ధరించడం, ఎక్కువగా బయటి ప్రాంతాలకు వెళ్లకుండా వుండటం, సమయానుకూలంగా తగిన జాగ్రత్తలు వహించడంతో దీనిని చాలావరకు అరికట్టవచ్చు.
అలాగే చల్లని ఆహారపదార్థాలు తీసుకునేవారు పరిస్థితులను బట్టి.. అంటే మీకు నిత్యం తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని తీసుకోకుండా చాలావరకు దూరంగా వుండాలి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే దీనిని చాలా సులభంగా నివారించుకోవచ్చు.
ఈ సమస్యను తొందరగా నివారించడానికి హోమియో చికిత్స అనేది చాలా ముఖ్యమైంది. ఈ అలర్జిక రైనసైటీస్ కు సంబంధించిన చికిత్స హోమియోలో చక్కని వైద్యం అందుబాటులో వుంది. ఈ వైద్యంతో నిత్యం బాధపడుతున్న అలర్జీ వ్యాధి నుంచి సంపూర్ణంగా బయటపడవచ్చు.
హోమియో వైద్య విధానంలో అర్సెనిక్ అల్బుమిన్ అకోనైట్, యుప్రాసియా, ఆలియం సెపా, అర్సెనికం లోడ్, హెపార్సల్ఫ్ వంటి ఔషధాలు.... పొటిన్సిలలో పాథోస్, పాసీఫ్లెరా, సనేగా, లెమ్నా మైనర్, టీఎంవీ వంటి ముఖ్యమైన ఔషదాలు ఈ వ్యాధిని నివారించడంలో ముఖ్యపాత్రను వహిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more