సాధారణంగా గర్భంతో వున్న స్త్రీలకు ఆకలి కోరికలు చాలానే పెరుగుతాయి. ఎంత తిన్నా కూడా ఇంకా ఏదో తినాలనే కోరిక వారిలో కలుగుతుంది. కొంతమంది తీపి పదార్థాలంటే చాలా ఇష్టపడతారు... మరికొందరు కారంతో కూడిన పదార్థాలను తీసుకోవడం ఇష్టపడతారు.
కొంతమంది విపరీతంగా ఆహారాన్ని ఎడతెరిపి లేకుండా సేవిస్తూనే వుంటారు. అయితే మరికొంతమంది దీనికి విరుద్ధంగా ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా వుంటారు. రోజుకు కేవలం ఒక్కపూట తిని గడిపేవాళ్లూ వుంటారు.
ప్రస్తుతకాలంలో శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనల్లో గర్భిణీస్త్రీలు పచ్చికూరగాయలు తీసుకోవడం ఎంతో మంచిదని పేర్కొంటున్నారు. ఇందులో వుండే ప్రోటీన్లు, పోషకాలు, రసాయనాలు, మినరల్స్ వంటివి నిత్యం ఆరోగ్యంగా, పిండాన్ని సంరక్షిస్తూ వుంటాయని వారు నిర్ధారించారు.
అయితే దాంతోపాటు కొన్ని జాగ్రత్తలను కూడా వారు మనకు సూచిస్తున్నారు. పచ్చికూరల్లో వుండే బ్యాక్టీరియా, హెమగ్లూటనిన్.. శరీరంలో వుండే రెడ్ బ్లడ్ సెల్స్ క్రియలకు హాని కలిగిస్తాయని చెబుతున్నారు. కాబట్టి పచ్చికూరల్ని తీసుకునే ముందు వాటిని కొద్దిసేపు ఉప్పునీటిలో నానబెట్టి, శుభ్రంగా కడిగిన తరువాత తీసుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
గర్భిణీస్త్రీలు తీసుకోవాల్సిన పచ్చికూరగాయలు....
బ్రొకోలీ..... గర్భంతో వున్న స్త్రీలు దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే... ఇందులో అధిక మోతాదులో వుండే విటమిన్స్ కడుపులో వున్న పిండం పెరుగుదలకు సహాయపడతాయి.
ఆస్పరాగస్..... గర్భంతో వున్నవారు తీసుకునే పచ్చికూరగాయల్లో ఆస్పరాగస్ ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే.. కడుపులో వుండే పిండం బ్రెయిన్ డెవలప్ మెంట్ కు అవసరం అయ్యే పొల్లెట్ ను ఇది అందిస్తుంది.
పచ్చి బఠానీ..... ప్రతిరోజూ ఒక స్పూన్ పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల... ఇందులో వుండే పొల్లెట్ కడుపులో వున్న శిశువు నాడీ వ్యవస్థ ఏర్పడటానికి సహాయపడుతుంది.
ఆకుకూరలు..... గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల అందులో వుండే ఐరన్ శరీర బలానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు.. అందులో వుండే పొల్లెట్ శిశువు పెరుగుదలకు అవసరం అవుతాయి.
కాలే..... పిండం పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు, విటమిన్లు ఇందులో పుష్కలంగా వుంటాయి.
కొలార్డ్ గ్రీన్..... ఇది అధిక మోతాదులో క్యాల్షియం కలిగి వుంటుంది. గర్భిణీస్త్రీలు ఇది తీసుకోవడం వల్ల కడుపులో వుండే శిశువును ఆరోగ్యంగా వుంచడమే కాకుండా... ఎముకలు స్థిరంగా ఏర్పడానికి సమాయపడుతుంది. స్కెలిటల్ మినిరలైజేషన్ కు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
కాలీ ఫ్లవర్..... ఇందులో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గర్భిణీ స్త్రీలను ఆరోగ్యంగా వుంచేందుకు ఉపయోగపడుతుంది. అయితే దీనిని తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిదని సలహాలు ఇస్తున్నారు. ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడే అవకాశం వుంటుంది.
బ్రసెల్స్ స్ర్పౌట్స్..... ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కడుపులో వుండే పిండం పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.
ఈ విధంగా పైన చెప్పిన ఆకుకూరలను గర్భధారణ సమయంలో తీసుకుంటే.. స్త్రీలు ఆరోగ్యంగా వుండడంతో పాటు... కడుపులో వున్న పిండానికి ఎంతో మేలు చేస్తాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more