ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాల్లో ‘ద్రాక్ష’ ఒకటి! ఈ ద్రాక్షలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి చాలావరకు చిరుజబ్బులను దరిచేయకుండా చేస్తాయి. అందుకే.. ద్రాక్షను తరుచూ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని నేరుగా తీసుకోవడం కంటే ‘జ్యూస్’ చేసి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. మరి.. ద్రాక్షతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
ద్రాక్ష పండ్లలో అల్జీమర్స్‌ను నయం చేసే లక్షణాలున్నాయి. ఇవి శరీరంలోని కొవ్వును యూరిన్ ద్వారా బయటకు పంపించేయడంతోపాటు యూరిక్ ఆమ్లాన్ని కూడా తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. ద్రాక్షరసాన్ని తీసుకోవడం ద్వారా రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులో వుండే ఐరన్ అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. శరీరానికి తేమనిస్తుంది. కంటికి మేలు చేయడంతోపాటు చూపును మెరుగుపరుస్తుంది. రోజూ ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తీసుకుంటే.. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ ద్రాక్ష కేవలం ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కంటి కిందటి వలయాలకు చెక్ పెట్టాలంటే.. ద్రాక్షపండ్లను కట్ చేసి ఆ రసాన్ని కంటికింద నల్లటి వలయాలపై రాస్తే ఫలితం ఉంటుంది. అలాగే.. ఒక స్పూన్ ద్రాక్ష రసంలో గుడ్డులోని తెల్లసొనను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లో వేసుకుని, 10 నిముషాల తర్వాత కడిగేస్తే.. చర్మం పొడిబారదు. ద్రాక్ష్ తొక్కలను ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే.. చర్మం ఫ్రెష్ గా తయారవుతుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్లు చర్మానికి క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది. చర్మాన్ని సన్ టాన్ నుంచి రక్షించి.. కొత్త కాంతిని ఇస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more