ప్రస్తుతరోజుల్లో ప్రతిఒక్కరు పోషకాహారలోపం తీసుకోకపోవడంతోపాటు వాతావరణ మార్పు పరిస్థితుల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పైగా.. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల కారణంగా సమయానికి భోజనం తీసుకోలేకపోతున్నారు. ఇలా తీసుకోని పక్షంలో వారి శరీరంలో వ్యాధినిరోధక శక్తి పూర్తిగా తగ్గి.. నీరసత్వంగా మారుతారు. అలాంటి సమయంలో ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు వున్నాయి. వాటిని తరుచుగా తీసుకుంటే.. పొట్ట సమస్యలు తగ్గడంతోపాటు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇంతకీ ఆ ఆహరాలేంటో తెలుసుకుందామా..
వెచ్చని పానియాలు (సూప్స్) : వెచ్చగా వుండే సూప్స్ ను ప్రతిరోజూ తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇవి శరీరాన్ని వెచ్చగా వుంచడంతోపాటు తాజాగా వుండేలా చేస్తాయి. ఇవి శరీరాన్ని ఉత్తేజపరచయడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఇక అల్లం, లెమన్, గ్రీన్ టీ వంటివి కూడా వ్యాధినిరోధకతను పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
మీట్ : బాగా ఉడికించిన మాంసాహారాలను వారానికి నాలుగుసార్లు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. నూనె తక్కువగా వాడే ఆహారాలను తీసుకుంటే ఇంకా మంచిది. మాంసాహారాలు ఫ్రై చేసిన వాటికంటే గ్రిల్ చేసిన లేదా ఉడికించిన ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ఇందులో వుండే పోషకగుణాలు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతాయి.
వెజిటేబుల్స్ : ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ లో పోషకగుణాలు అధిక మోతాదులో నిల్వవుంటాయి. వీటిని శుభ్రంగా కడిగి ఏదైనా ఒక వండటం వండి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలా ప్రతిరోజూ తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి తరచూ పెరగడంతోపాటు రోజంతా ఎంతో ఆరోగ్యంగానూ, ఫ్రెష్ గానూ వుండేలా అనుభూతి పొందవచ్చు.
ఫ్రూట్స్ : విటమిన్ సి ఎక్కువగా నిల్వవుండే ఫుడ్స్ తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. దానిమ్మ, కివి, ఆరెంజ్ వాటిల్లో విటమిన్-సి ఎక్కువగా వుంటుంది. అలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఎంతో ఉత్తమం. అయితే.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు నీటి శాతం అధికంగా ఉండే ఫ్రూట్స్ ను తినకుండా ఉండటమే మంచిది.
యాంటీఆక్సిడెంట్స్ వుండే ఆహారాలు : యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేఖంగా పోరాడి శరీరానికి కావాల్సిన వ్యాధినిరోధకతను పెంచుతాయి. ఆరోగ్యంగా ఉంచే ఇమ్యూనిటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే.. ఎంతో శ్రేయస్కరం. అలాంటి ఆహారాల్లో క్యాప్సికమ్, బెర్రీస్, గుమ్మడి ఉత్తమమైనవి.
జ్యూసులు : జ్యూసులు తరుచుగా తీసుకుంటే.. అవి శరీరానికి తగిన హైడ్రేషన్ అందిస్తాయి. తాజాగా వుండే పండ్లు, వెజిటేబుల్స్ తో తయారుచేసిన జ్యూసులను అధికంగా తీసుకోవాలి. వీటిలో వుండే పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more