ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల్లో స్వీట్ కార్న్ ఒకటి! ఇందులో ఎవరికీ తెలియని ఎన్నో ఔషధగుణాలు దాగివున్నాయి. ఇది రకరకాల హానికారక వ్యాధుల నుంచి పోరాడి.. ఆరోగ్యంగా వుంచుతుందని నిపుణులు అంటున్నారు. వీటిల్లో వుండే పోషకాలు వ్యాధినిరోధక శక్తి పెంచడంతోపాటు వ్యాధులను దూరంగా వుంచుతాయని వారంటున్నారు. ఇంతకీ స్వీట్ కార్న్ కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...
స్వీట్ కార్న్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
* స్వీట్ కార్న్.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్నను రెగ్యులర్‌గా మితంగా తీసుకుంటే.. గుండె రక్తకణాల ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. అంతేకాదు.. రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ ఈ స్వీట్ కార్న్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి.. స్వీట్ కార్న్ రెగ్యులర్ గా స్నాక్స్ టైమ్ లో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
* మొక్కజొన్నలో శరీరానికి ముఖ్యంగా అవసరమయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి. అలాగే ఎముకలు, కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఫాస్పరస్ ఈ కార్న్ లో వుంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం హార్ట్ రేట్‌ను నార్మల్‌గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* స్వీట్ కార్న్ తగినంత పరిమాణంలో ప్రతిరోజూ తీసుకుంటే.. మధుమేహంతో బాధపడే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. స్వీట్ కార్న్‌లో ఫైటోకెమికల్స్ వుంటాయి. అవి మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more