రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గడం వల్ల డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ప్రస్తుతకాలంలో ఈ వ్యాధి బారిన పడుతున్న సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే.. దీనిని నయం చేయడం అసాధ్యం! కానీ.. కొన్ని చిట్కాలతో నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ తో బాధపడుతున్నవారు ఆ చిట్కాలను తూ.చ.తప్పకుండా పాటించాల్సి వుంటుంది. మరి.. ఆ ఆరోగ్యా చిట్కాలేంటో తెలుసుకుందామా..
* ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా విత్తనాలు తీసేసిన కాకరకాయ రసాన్ని తాగాలి.
* రోజూ ఒక స్పూన్ దాల్చినచెక్క తినాలి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది కాబట్టి.. దీనిని తప్పనిసరగా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
* ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్ళలో వేసి రాత్రంతా నాన బెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీళ్ళు తాగి, నానిన మెంతులు తింటే అది ఇన్సులిన్‌లా పని చేస్తుంది.
* పచ్చి అరటిపండుపై తొక్క తీసి ఒక పాత్రలో వేసి దానిమీద నీళ్ళు పోసి రాత్రంతా వుంచి.. తెల్లవారిన తర్వాత ఆ నీటిని మూడు భాగాలు చేసి పగలు మూడుసార్లు తాగాలి.
* ఒక కప్పు నీళ్ళలో మామిడి ఆకులు 13 నుంచి 16 వేసి బాగా మరిగించి, రాత్రంతా చల్లారనిచ్చి ఉదయం వడకట్టి ఆ నీటిని పరగడుపున తాగాలి.
* వెల్లుల్లిని తినాలి లేదా వెల్లుల్లి కలిగిన మాత్రలు తీసుకుంటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more