గర్భిణీ స్త్రీలు చాలా ఆరోగ్యంగా వుండాలని వైద్యనిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటిశాతం అధికంగా వుండటంతోపాటు విటమిన్-సి, విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్-ఏ, పొటాషియం, మెగ్నీషియం తదితర పోషకాలు వుంటాయి. ఇవి గుండె, స్టొమక్ ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. గర్భధారణ సమయంలో గర్భిణీలు పుచ్చకాయను తినడం వల్ల వారిలో ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, కాళ్ళు, చేతుల వాపులను నివారిస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ ను ఎదుర్కొంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవేమిటో తెలుసుకుందాం..
* గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎసిడిటి, జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో పుచ్చకాయ తీసుకుంటే ఆ సమస్యలను అది నివారిస్తుంది. హార్ట్ బర్న్ కు కారణం అయ్యే ఎసిడిటి, ఎసిడిక్ రిఫ్లెక్షన్ నివారిస్తుంది. పొట్ట, జీర్ణవాహికకు చల్లదనం కలిగిస్తుంది.
* గర్భధారణ సమయంలో పిగ్నెంటేషన్ చాలా సాధారణ సమస్య. ప్రెగ్నెన్సీల్లో హైలెవల్ హార్మోన్స్ వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలో వాటర్ మెలోన్ తీసుకుంటే.. అది శరీరంను శుభ్రం చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను నివారిస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరిచి.. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.
* కడుపులో బిడ్డ పెరిగే కొద్ది బ్లడ్ వెజల్స్ లో రక్తం ప్రసరణ తగ్గుతుంది. దాంతో కాళ్ళు, చేతుల్లో వాపులు మెదలవుతాయి. అలాంటి సమయంలో పుచ్చకాయ తీసుకుంటే మంచింది. ఎందుకంటే.. ఆ కాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి... అది వాపులను తగ్గిస్తుంది.
* గర్భిణీ స్త్రీల ‘డీహైడ్రేషన్’ కు గురి అయితే.. ప్రీమెచ్చుర్ బర్త్, యూట్రస్ సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలబారి నుంచి ఉపశమనం పొందాలంటే.. పుచ్చకాయ తీసుకోవడం ఉత్తమం. అది శరీరానికి అవసరం అయ్యే ద్రవాలు, విటమిన్స్ పుష్కలంగా అందిస్తుంది.
* గర్భధారణ ప్రారంభదశలో మహిళలు ‘యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్’కు ఎక్కువగా గురి అవుతుంటారు. అప్పుడు వేరే ఇతర మందులు తీసుకోకూడదు. కానీ.. వాటర్ మెలోన్ తీసుకోవచ్చు. అది బ్యాక్టీరియాను నివారిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది.
* గర్భధారణ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల బరువు పెరుగుతంది. తద్వారా మజిల్ క్రాంప్, ఎముకల్లో నొప్పి మొదలువుతుంది. అలాంటి సమయంలో పుచ్చకాయ తీసుకుంటే.. అందులో వుండే పొటాషియం, మెగ్నీషియం మజిల్ పెయిన్ కు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more