ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలను తీసుకుంటే.. సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఆ ఆహారాల్లో పోషక విలువలు అధిక మోతాదులో నిల్వవుంటాయి కాబట్టి.. అవి వివిధరకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతోపాటు ఆరోగ్యంగా వుంచుతాయి. అలాంటి వాటిల్లో ‘నేరేడుపండ్లు’ ఒకటి. ఈ పండ్లలో ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి పుష్కలంగా వుంటాయి. అంతేకాదు.. ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్ 15, ఐరన్ 1.2, విటమిన్ సి 18మి.గ్రా. ఉంటాయి. ఇన్ని పోషకాలు కల్గిన ఈ పండ్లతో ఎటువంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా..
* నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో వుంచడంతోపాటు తరచూ దాహం, యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.
* ఈ పండ్లులో పొటాషియం కంటెంట్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. పోషకాహారాల లోపం వల్ల కలిగే గుండె జబ్బలను నివారించడంలో ఇవి దోహదపడుతాయి. అంతేకాదు.. మెదడు సంబంధిత రోగాలను దూరం చేయడంతోపాటు నిత్యం చురుకుగా వుండేలా సహకరిస్తాయి. కాబట్టి.. ఈ పండ్లు రెగ్యులర్ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
* చర్మసంబంధిత సమస్యల్ని దూరం చేయడంలోనూ ఈ పండ్లు సహకరిస్తాయి. ముఖ్యంగా స్కిన్ రాషెష్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది. నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ ను పాలలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా పట్టించి.. మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలు పూర్తిగా నివారించబడుతాయి.
* నేరుడు పండు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంటుగా పనిచేయడమే కాక, రోగనిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతుంది. ఈ పండులో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్స్ సి పుష్కలంగా వుంటాయి. అవి రోగ్యనిధోక శక్తిని పెంచడంలో దోహదపడుతాయి. తద్వారా శరీరం ఆరోగ్యంగా వుండటంతోపాటు రోజంతా ఉత్సాహంగా వుండేలా అనుభూతి పొందవచ్చు.
* కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల్లో ఈ నేరేడు పండ్లు ఎంతో ఉత్తమమైనవి. ఎందుకంటే.. కళ్లకు ఎంతో అవసరమైన విటమిన్-ఎ, సి వంటి పోషకాలు ఈ పండ్లలో పుష్కలంగా వుంటాయి. అవి కళ్లను ఆరోగ్యంగా వుంచడంతోపాటు చూపును మెరుగుపరుస్తాయి. అలాగే.. ఆ విటమిన్లు చర్మ ఆరోగ్యానికి ఎంతోగానో సహకరిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more