ప్రస్తుత యాంత్రిక జీవనంలో ప్రశాంతత లోపించింది. మనిషి అనేక పనులు, షెడ్యూల్డ్ టాస్క్ లతో బిజీగా గడుపుతున్నాడు. ఇలా ఇంటి, వ్యాపార ఇతర సమస్యల గురించి ఆలోచిస్తూ మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఎన్ని టాబ్లెట్లు వాడినా.., ఎంతమంది డాక్టర్లను కలిసినా సమస్య నివారణకు చెప్పే సులువైన మార్గం యోగా. ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప ఔషదమే ఈ యోగా. శారీరక, మానసిక సమస్యల పరిష్కారిణిగా మన మహారుషులు ఈ యోగాను అందించారు. అయితే మనం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రసాదంనే విదేశీయులు పాటించి ప్రయోజనాలు పొందుతున్నారు. ఈమధ్య తిరిగి మన దేశంలోనూ పాపులర్ అవుతున్న ఈ యోగాతో ఒత్తిడి ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.
సుఖాసనం : మామూలుగా కూర్చుని వేసే అతి సులభమైన ఈ ఆసనం మనస్సుకు ప్రశాంతత చేకూరుస్తుంది. ఆసనం వేసే సమయంలో మనస్సు ఎక్కువగా భయాందోళనలకు గురికాకుండా మూడుసార్లు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని నిదానంగా వదిలి ఆసనం మొదలు పెట్టాలి.
ప్రాణాయామం : యోగా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. అలాంటి యోగాను ఆసనాలతో కలిపి చేయటం ప్రాణాయామం. సుఖాసనంలో కూర్చునే.., బాగా గాలి పీల్చి వదిలాలి. ఇలా ఓ పది నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ సమయం చేసినా తప్పేమి లేదు. అయితే చేతులను పైకి ఎత్తి నమస్కరిస్తునట్లు భంగిమను పెట్టాలి.
బాలాసన : చిన్నపిల్లలు ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారో తెలిసిందే. వారికి ఏ చీకుచింతా ఉండవు. దీనికి వారు పడుకునే, ఉండే విధానం కూడా కారణం. పిల్లలు సాధారణంగా మోకాళ్లపై కూర్చున్నట్లుగా ఉండి తలను నేలకు ఆనించి పడుకుంటారు. ఇలా చేయటం వల్ల నరాల పనితీరు మెరుగయి మెదడును ఉత్తేజపరుస్తుంది. ఉండగలిగినంత సేపు ఈ ఆసనంలో ఉండవచ్చు.
గరుడాసనం : గ్రద్ద ఒంటికాలిపై నిలబడినట్లుగా.., ఎడమ లేదా కుడికాలిపై నిల్చుని మరోకాలిని నిలబెట్టిన కాలిపైనుంచి మడచాలి. ఇలా మడిచే కాలి యొక్క మోకాలు ముందుకు చూపిస్తూ.., పాదం వెనక్కి చూడాలి. అదేవిధంగా చేతులు కూడా ఒకదానితో మరొకటి పెనవేసుకుని మెలివేసుకుని నమస్కారం చేస్తున్నట్లుగా ఉండాలి.
మార్జారి, బిటిల ఆసనం : మోకాళ్లపై కూర్చుని ముందుకు వంగి చేతులు కిందికి పెట్టి ఈ ఆసనం చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ చురుగ్గా జరుగుతుంది, అంతేకాకుండా మెదడుకు కూడా హాయినిస్తుంది. ఆ ఆసనంలోనే కొన్ని మార్పులు చేస్తే బిటిలాసనం వస్తుంది. అదెలాగంటే.., నడుమును కిందకు వంచి.. తలను పైకి ఎత్తాలి. దీనివల్ల మెదడుకు వెళ్లే వెన్నెముక ఉత్తేజం అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more